కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నాలుగు అక్రమ లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
న్యూస్‌తెలుగు/వనపర్తి : కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నాలుగు అక్రమ లేబర్ కోడ్ లను రద్దు చేయాలని, మిగతా కార్మికుల డిమాండ్ లను సాధించాలని దేశవ్యాప్త సంఘటిత కార్మికుల సార్వత్రిక సమ్మె కు అఖిలపక్ష ఐక్యవేదిక. అధ్యక్షుడు సతీష్ యాదవ్ సంఘీభావం తెలిపారు. పలు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వo ప్రకటించిన కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు ఏకమై ఉదృతంగా సార్వత్రిక సమ్మెను విజయవంతంగా కొనసాగించాలని అందుకు వనపర్తి లో అన్ని పార్టీల కార్మిక సంఘాలు, యూనియన్లు, నేతలు తలపెట్టిన ర్యాలీకి సంఘీభావం తెలుపుతూ అఖిలపక్ష ఐక్యవేదిక కూడా పాల్గొన్నది. ఇందులో భాగంగా సిపిఎం, సిపిఐ, తెలుగుదేశం, టిఆర్ఎస్, బి.ఎస్.పి, రైతాంగ పార్టీలకు సంబంధించిన అన్ని కార్మిక సంఘాలు, యూనియన్లు, ఉద్యోగ సంఘాలకు సంబంధించిన యూనియన్లు పాల్గొన్నారు. (Story:కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నాలుగు అక్రమ లేబర్ కోడ్ లను రద్దు చేయాలి)

