ప్రైవేటీకరణ చేయడం దుర్మార్గమైన చర్య
న్యూస్‌తెలుగు/వనపర్తి : పెబ్బేరు మండల కేంద్రంలో సుభాష్ చౌరస్తా నుంచి మార్కెట్ యార్డ్ వరకు ప్రదర్శనగా వెళ్లి అక్కడ సభ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సిఐటియు వనపర్తి జిల్లా అధ్యక్షులు మండ్ల రాజు మాట్లాడుతూ కేంద్ర బిజెపి ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జులై 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు ట్రేడ్ యూనియన్స్ పిలుపునిచ్చాయి. ఈ సమ్మెను పెబ్బేరు మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. కేంద్ర బిజెపి ప్రభుత్వం కార్మికుల ను బానిసత్వంలోకి నెట్టే విధంగా నాలుగు లేబర్ కోడ్ లను తీసుకొచ్చి కార్మికుల మెడకు ఉరితాలుగా బిగించారన్నారు. పెట్టుబడుదారులకు అనుకూలంగా ఉన్న నాలుగు లేబర్ కోడ్ లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులకు రోజుకు 12 గంటల పని దినాన్ని అమలు చేసే విధానాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికులకు కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని అర్హులైన కార్మికులందరికీ పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించి. కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ పర్మినెంట్ చేయాలన్నారు. ధరలను అదుపు చేయడంలో మోడీ ప్రభుత్వం విఫలమైందని ప్రభుత్వ రంగ సంస్థలను అప్పనంగా ప్రైవేట్ సంస్థలకు అప్పజెప్పే విధంగా నేషనల్ మానిటర్ పైపులైజేషన్ NMP పేరుతో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడం దుర్మార్గమైన చర్య అన్నారు. యువతకు ఉపాధి చూపడంలో మోడీ ప్రభుత్వం విఫలం అవడంతో పాటు ఉన్న ఉద్యోగాలకు కూడా మోడీ ప్రభుత్వం ఊడగొడుతుందని ఎద్దేవా చేశారు. రైతాంగం పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం లేదన్నారు. ఉపాధి హామీ పథకాన్ని పట్టణ ప్రాంతాలకు విస్తరింప చేసి. సంవత్సరానికి 200 రోజులు పనులు కల్పించి రోజుకి 600 కూలీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికుల హక్కుల కోసం రైతాంగ హక్కుల కోసం ఉపాధి హామీ కూలీల డిమాండ్ల సాధన కోసం యువతకు ఉపాధి ఉద్యోగాల సదనకై సాగుతున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో కార్మికులు కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ టి యు సి ఐ జిల్లా నాయకులు శీను ఆవాజ్ జిల్లా కార్యదర్శి ఎండి పెద్దకాజా సిఐటియు నాయకులు ఊసన్న అనీఫ్ అంగన్వాడి యూనియన్ జిల్లా కోశాధికారి రాధా నాయకులు రాజేశ్వరి రాములు మన్నెం చెన్నమ్మ ఈశ్వరమ్మ నరసమ్మ నారాయణ రాములు తదితరులు పాల్గొన్నారు. (Story:ప్రైవేటీకరణ చేయడం దుర్మార్గమైన చర్య)

