ప్రశాంతిరెడ్డికి- ప్రసన్న కుమార్ రెడ్డి
క్షమాపణ చెప్పాలి
ప్రభుత్వ చీఫ్ విప్ జీవి
న్యూస్ తెలుగు /వినుకొండ : నెల్లూరు జిల్లా మహిళ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పై వైసిపి నేత నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు బుధవారం తీవ్రంగా ఖండించారు. మహిళ పట్ల అసభ్యకరంగా నోరు పారేసుకున్న ప్రసన్న కుమార్ రెడ్డి బహిరంగంగా ప్రశాంతిరెడ్డికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళల పట్ల వైసిపి తీరు సిగ్గుచేటని, సమాజంలో ఇలాంటి వ్యాఖ్యలకు స్థానం లేదని, బహిరంగంగా క్షమాపణ చెప్పకపోతే రాష్ట్ర మహిళలు తగిన విధంగా ప్రసన్న కుమార్ రెడ్డికి బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. మహిళలను అగౌరవపరుస్తూ, కించపరిచే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రసన్న కుమార్ రెడ్డి పై చర్యలు తప్పవని హెచ్చరించారు. (Story:ప్రశాంతిరెడ్డికి- ప్రసన్న కుమార్ రెడ్డి క్షమాపణ చెప్పాలి)