Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌అగ్నిప్రమాద బాధితులకు ప్రభుత్వ చీఫ్ విప్ జివి ఆర్థిక సాయం

అగ్నిప్రమాద బాధితులకు ప్రభుత్వ చీఫ్ విప్ జివి ఆర్థిక సాయం

అగ్నిప్రమాద బాధితులకు ప్రభుత్వ చీఫ్ విప్ జివి ఆర్థిక సాయం

న్యూస్ తెలుగు /వినుకొండ : వినుకొండ నియోజకవర్గం, బొల్లాపల్లి మండలం, సరికొండపాలెం గ్రామంలో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయిన మూడు కుటుంబాలను ప్రభుత్వ చీఫ్ విప్ జివి ఆంజనేయులు బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వినుకొండ కార్యలయంలో బాధితులకు వంట సామాన్లు, బియ్యం, మరియు నగదు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అగ్నిప్రమాదంతో నిరాశ్రయులైన కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ఈ సందర్భంగా జీవి భరోసా ఇచ్చారు. బాధితులకు తక్షణ సాయం అందించడమే కాకుండా, దీర్ఘకాలిక పునరావాసానికి కూడా కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జున రావు, నాయకులు పాల్గొన్నారు. (Story :అగ్నిప్రమాద బాధితులకు ప్రభుత్వ చీఫ్ విప్ జివి ఆర్థిక సాయం )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!