Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ ప్రతి ఒక్క రైతు పంటల భీమా చేయించుకోవాలి

ప్రతి ఒక్క రైతు పంటల భీమా చేయించుకోవాలి

0

ప్రతి ఒక్క రైతు పంటల భీమా చేయించుకోవాలి

న్యూస్ తెలుగు/సాలూరు : జూలై 15వ తారీకు లోపు పంటల భీమా ప్రతి ఒక్క రైతు చేయించుకోవాలని సాలూరు మండల వ్యవసాయ అధికారి కె శిరీష అన్నారు. మంగళవారం సాలూరు మండలంలో
మరిపల్లి ,తాడంగివలస గ్రామాల్లో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం లో ఆమె మాట్లాడుతూ రైతులు ఎవరికైతే బ్యాంకులో పంట రుణము లేదో వాళ్లు పంటల బీమా,ప్రత్తి కి(1900/-) మరియు అరటి (3000/-) ఒక ఎకరానికి రైతు ప్రీమియం గా చెల్లించి క్రాప్ ఇన్సూరెన్స్ ఈ నెల 15 వ తారీకు లోగ చేయించుకోవాలని తెలియచేసారు అలానే మొక్కజొన్న (330/-) ఒక ఎకరానికి రైతు ప్రీమియం ఈ నెల 31 వ తారీకు లోగ చెల్లించి క్రాప్ ఇన్సూరెన్స్ చేయించుకోవాలని అలానే వరికి (800/-) ఒక ఎకరానికి రైతు ప్రీమియం గా చెల్లించి ఆగష్టు 15 వ తారీకు లోగ క్రాప్ ఇన్సూరెన్స్ దగ్గర్లో ఉన్న సిఎస్సి సెంటర్లో గానీ మీసేవ సెంటర్లో గానీ చేయించుకోవాలని తెలియచేసారు.
అలానే కౌలు చేస్తున్న రైతులు గ్రామా vro గారి ద్వారా కౌలు కార్డులు పొందడం ద్వారా ప్రభుత్వ పథకాలకు అర్హత పొందుతారని తెలియచేసారు పంటలు సాగుచేతున్న ప్రతి రైతు ఖచ్చితముగా గ్రామ వ్యవసాయ సహాయకులిని సంప్రదించి ఈ పంట నమోదు చేయించుకోవాలని తెలియచేసారు, ఈ కార్యక్రమం లో గ్రామ పెద్దలు మరియు వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. (Story:ప్రతి ఒక్క రైతు పంటల భీమా చేయించుకోవాలి)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version