Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ జులై 9 దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయండి

జులై 9 దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయండి

0

జులై 9 దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయండి

న్యూస్ తెలుగు / వినుకొండ : భారతదేశ వ్యాప్తంగా కార్మిక సంఘాలు, రైతు సంఘాల ఐక్యవేదిక పిలుపుమేరకు తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు సంపూర్ణ మద్దతును తెలియజేస్తూ సమ్మెను విజయవంతం చెయ్యాలని సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్ కార్మిక, రైతు సంఘాల శ్రేణులకు, పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. దేశ వ్యాప్త సమ్మె సందర్భంగా సోమవారం నాడు సమ్మెకు మద్దతు తెలియజేస్తూ ఆయన పత్రికా విలేకరులకు ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఇప్పటికే దేశవ్యాప్తంగా వామపక్షాలు ప్రజాసంఘాలు సమ్మెకు మద్దతు తెలియజేశారని, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రైతు సంఘాల ఆధ్వర్యంలో 3 నల్ల చట్టాలు రద్దు చేయాలని, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు చట్టబద్ధత చేయాలని, కార్మికుల చట్టాలను కాపాడాలని సంవత్సరం పైబడి జరిగిన ఢిల్లీ బంద్ రాస్తారోకోల సందర్భంగా రైతులతో జరిగిన భేటీలో వారికి మద్దతుగా సమ్మెను విరమింప చేయమని మూడు నల్ల చట్టాలను రద్దు చేస్తామని రైతు పండించిన పంటకు మద్దతు ధర చట్టబద్ధత చేస్తామని వ్రాతపూర్వకంగా హామీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని మూడు సంవత్సరాలు దాటిన నేటి వరకు అమలు చేయలేదని, కార్మికులు దశాబ్దాల పాటు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కాలరాస్తూ నాలుగు లేబర్ కోడ్లుగా విభజించి కార్మికుల చట్టాలను ఎత్తివేసారని ఈ విధంగా నరేంద్ర మోడీ దేశానికి పట్టెడన్నం పెట్టే రైతన్నను కార్మిక శక్తితో దేశంలో సంపద సృష్టిస్తున్న కార్మికుల శ్రమ శక్తిని కార్పొరేట్ రంగ దోపిడీ దొంగల చేతిలో పెట్టాలని నిర్ణయించిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు రైతు సంఘాల ఐక్యవేదిక జాతీయ సార్వత్రిక సమ్మెను చేయ నిర్ణయించిన నేపథ్యంలో ఈ సమ్మెను విజయవంతం చేయాలని ఆయన పల్నాడు జిల్లా రైతు సంఘాలకు, కార్మిక సంఘాలకు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. (Story:జులై 9 దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయండి)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version