పాత నేరస్తులకు కౌన్సిలింగ్
డొంకరా ఎస్సై శివకుమార్
న్యూస్ తెలుగు/చింతూరు : అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ బర్ధర్ చింతూరు అడిషనల్ ఎస్పీ పంకజ్ కుమార్ మీనా, ఆదేశాల మేరకు డొంకరాయి పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటూ రాష్ట్రంలో వివిధ పోలీస్ స్టేషన్లో గంజాయి కేసుల్లో ముద్దాయిలుగా ఉన్న పాత నేరస్తులకు ఎస్ఐ శివకుమార్ కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్ఐ శివకుమార్ మాట్లాడుతూ గంజాయి కేసుల్లో ముద్దాయిలు ఉన్న ప్రతి వ్యక్తిపై సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేసి వారిపై నిఘా ఉంచుతామని తెలిపారు. రాష్ట్రంలో వివిధ పోలీస్ స్టేషన్లో గంజాయి కేసులో ఉన్న ప్రతీ పాత నేరస్తులపై నిఘా ఉంచి వారు మంచి మార్గంలో నడిచేలా కౌన్సిలింగ్ ఇస్తున్నట్లు తెలిపారు. గంజాయి కేసుల్లో ఇరుక్కుంటే జైలుపాలు అవ్వక తప్పదని, వారిపై కఠినంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. గంజాయి కేసుల్లో ఉన్న ప్రతి వ్యక్తికి ప్రతి వారం కౌన్సిలింగ్ ఇస్తున్నట్లు తెలిపారు. (Story:పాత నేరస్తులకు కౌన్సిలింగ్ )