విద్యార్థులకు అన్యాయం చేసి వేడుక చూస్తున్న అధికారులు
న్యూస్‌తెలుగు/వనపర్తి : అధికారులు నిబంధనలను తుంగలో తొక్కి వీపనగండ్ల ప్రభుత్వ పాఠశాలలో ఉన్న ఇంగ్లీష్ టీచర్ ను ఆర్థిక లావాదేవీలతో వనపర్తికి బదిలీ చేయడాన్ని అఖిలపక్ష ఐక్యవేదిక,సిపిఎం తరపున సంయుక్తంగా ఖండిస్తున్నామని వీపనగండ్లలో బాలికల మరియు బాలుర పాఠశాలల్లో కలిపి ఒక్కరే ఇంగ్లీష్ టీచర్ ఉన్నాడని , అతన్ని ఐదు మంది ఇంగ్లీష్ టీచర్లు ఉన్న వనపర్తి బాలుర పాఠశాలకు ఎలా పంపుతారని ప్రశ్నించారు. వెంటనే ఈ అక్రమ డిప్యూటేషన్ ను ఎత్తివేయకుంటే వనపర్తి లోని ప్రజా సంఘాలు, అఖిలపక్ష పార్టీలు విద్యార్థి సంఘాలు ఏకమై ఉద్యమం చేస్తుందని, అతను ఇప్పటికీ వనపర్తి లో 18 సంవత్సరాలు పనిచేశాడని, రాజకీయ పార్టీలతో అంట కాగుతూ రాజకీయాలు చేస్తూ విద్యార్థులకు అందుబాటులో ఉండడని ఎట్టి పరిస్థితుల్లో వనపర్తి కి అతను వద్దని వనపర్తి ప్రజలు ఘంటాపదంగా చెప్తున్నారు. కనుక మంత్రి , జిల్లా కలెక్టర్ , వనపర్తి ఎమ్మెల్యే , ప్రణాళిక బోర్డు వైస్ చైర్మన్ వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలంతా ముక్తకంఠంతో కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్, సిపిఎం నాయకులు బాల్ రెడ్డి, దేవేందర్, టిడిపి నాయకులు కొత్త గొల్ల శంకర్, టిఆర్ఎస్ నాయకులు బొడ్డుపల్లి సతీష్, సామాజిక కార్యకర్త గౌనికాడి యాదయ్య, ఐక్యవేదిక పట్టణ అధ్యక్షుడు రామస్వామి, కురుమూర్తి, రవి, ఇటుకూరి రంజిత్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. (Story:విద్యార్థులకు అన్యాయం చేసి వేడుక చూస్తున్న అధికారులు)