Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక దుశ్చర్యలపై కార్మిక వర్గం జులై 9న సమ్మె బాట

కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక దుశ్చర్యలపై కార్మిక వర్గం జులై 9న సమ్మె బాట

0

కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక దుశ్చర్యలపై కార్మిక వర్గం జులై 9న సమ్మె బాట

న్యూస్‌తెలుగు/వనపర్తి : కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక దుశ్చర్యాలపై జులై 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు కార్మిక వర్గం శంఖారావం పూరించి సమ్మెబాట పడుతున్నారని తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర కార్యదర్శి పి.సురేష్ అన్నారు. కార్మిక హక్కుల సాధనకై జులై 9న జరగనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె నేపథ్యంలో శనివారం తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (ఎఐటియుసి) ఆధ్వర్యంలో వనపర్తి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రంగారావుకి, వనపర్తి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి అంబియన్స్ ఏజెన్సీ, వనపర్తి ప్రభుత్వ మెడికల్ కళాశాల రాజ్ దీప్ ఏజెన్సీ కాంట్రాక్టర్ శ్రీకాంత్ రెడ్డికి శానిటేషన్ పేషెంట్ కేర్ సెక్యూరిటీ సూపర్వైజర్ కార్మికులు సమ్మె నోటీసు అందజేశారు.
ఈ సందర్భంగా పి. సురేష్ మాట్లాడుతూ:-కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మికుల సంక్షేమం విస్మరిస్తూ కార్మిక హక్కులను కాలరాసే విధంగా కార్మిక వర్గానికి గోతులు తవ్వుతూ బడా కార్పొరేట్ సంస్థల శక్తులకు,దోపిడి కాంట్రాక్టర్ యాజమాన్యాలకు అనుకూలంగా నూతన ఆర్థిక విధానాలను రూపకల్పన చేస్తున్నారని మండిపడ్డారు. పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలకు తూట్లు పొడుస్తూ నాలుగు లేబర్ కోడ్ లుగా తీసుకొచ్చారని దీనితో కార్మిక వర్గం హక్కులు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దివాలా కోరు విధానాలను స్వస్తి చెప్పకపోతే కార్మిక వర్గం తగిన బుద్ధి చెప్పే రోజులు వస్తాయని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న శానిటేషన్ పేషెంట్ కేర్ సెక్యూరిటీ సూపర్వైజర్ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. కాల పరిమితి ముగుస్తున్న ఐహెచ్ఎఫ్ఎంఎస్ నూతన టెండర్ల ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని కార్మికులకు కనీస వేతనం 26 వేలకు పెంచాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో వనపర్తి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వనపర్తి ప్రభుత్వ మెడికల్ కళాశాల యూనియన్ నాయకులు కార్మికులు శ్రీనివాస్, నరసింహ, వరుణ్,మద్దిలేటి,రాజేష్, దర్గ స్వామి,రాజశేఖర్, కుమార్,అనిల్,ఉదయ్, ప్రవీణ్,కళవతమ్మ, గోవిందమ్మ, మంజుల బాలమ్మ,లావణ్య, లక్ష్మి,శ్రీదేవి,లత,చెన్నమ్మ పిరమ్మ,జయలక్ష్మి, సహజ బేగం,సుజాత, శారద,లక్ష్మి,భాగ్య తదితరులు పాల్గొన్నారు. (sTORY:కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక దుశ్చర్యలపై కార్మిక వర్గం జులై 9న సమ్మె బాట)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version