Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ సాలూరులో మెగా జాబ్ మేళా

సాలూరులో మెగా జాబ్ మేళా

0

సాలూరులో మెగా జాబ్ మేళా

న్యూస్ తెలుగు/ సాలూరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని యువతకు, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకే ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళా ఎంతో ఉపయోగపడుతుందని ఆంధ్రప్రదేశ్ శ్రీ శిశు సంక్షేమ మరియు గిరిజన శాఖ మాత్యులు గుమ్మడి సంధ్యారాణి అన్నారు శనివారం సాలూరు పట్టణంలో గల శ్రీ సత్యసాయి జూనియర్ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతలోని నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళా ఎంతో విజయవంతంగా సాగిందని తెలిపారు. “రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతిఒక్క యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని అన్నారు ఈ జాబ్ మేళా ద్వారా ఎన్నో కుటుంబాల్లో వెలుగు రాబోతుందని . యువత శ్రమించే మనస్తత్వంతో, అర్హతలతో ఉంటే ఉద్యోగం లభించడం ఖాయం,” అని అన్నారు.ఈ జాబ్ మేళాలో 12 ప్రముఖ ప్రైవేటు కంపెనీలు పాల్గొన్నాయని తెలిపారు సాంకేతిక రంగం, ఫార్మా, మెషీనింగ్, కస్టమర్ సపోర్ట్, ఫైనాన్స్, మాన్యుఫ్యాక్చరింగ్ తదితర విభాగాల్లో మొత్తం 415 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ అయ్యాయని. ఇంటర్వ్యూలు స్థలంలోనే నిర్వహించ బడిందని అన్నారు పలువురు అభ్యర్థులు తక్షణమే ఎంపికయ్యారని తెలిపారు అభ్యర్థులు తమ సివిలు, విద్యార్హత పత్రాలు, గుర్తింపు కార్డులతో వచ్చి ఇంటర్వ్యూలకు హాజరయ్యారని, మహిళా అభ్యర్థుల సంఖ్య గణనీయంగా ఉండడం విశేషంఅని అన్నారు. యువతకు మార్గదర్శకంగా ఉండేలా క్యాంపస్ రిక్రూట్‌మెంట్, స్కిల్ మాపింగ్, జాబ్ రోల్ అవగాహన వంటి అంశాలపై కూడా స్పష్టమైన సమాచారం అందించబడిందని అన్నారు.
అనంతరం స్టాల్స్‌ సందర్శించి, యజమానులతో పాటు అభ్యర్థులతో మాట్లాడారు. యువతలో అద్భుతమైన నైపుణ్యం ఉందని ప్రశంసిస్తూ, ఇలా ఉద్యోగ మేళాలు నియమితకాల వ్యవధిలో ప్రతి జిల్లాలో నిర్వహించేందుకు అవసరమైన చొరవ తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముఖి సూర్యనారాయణ, పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నిమ్మాది తిరుపతిరావు మండల అధ్యక్షుడు పరమేష్, కౌన్సిలర్ వైకుంఠపు హర్షవర్ధన్, బంగారం పేట ప్రధానోపాధ్యాయులు రంబ రజినీకాంత్, స్కిల్ డెవలప్మెంట్ ప్రతినిధులు పాల్గొన్నారు. (Story:సాలూరులో మెగా జాబ్ మేళా)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version