పేదలకు అండగా సి ఎం సహాయనిధి
న్యూస్ తెలుగు /సాలూరు : పేదలకు అండగా సి ఎం సహాయనిధి లబ్ధిదారులకు ఎంతో ఉపయోగపడుతుందని ఈ నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు లబ్ధిదారులు రుణపడి ఉంటారని ఆంధ్రప్రదేశ్ శ్రీ శిశు సంక్షేమ మరియు గిరిజన శాఖ మత్యులు గుమ్మడి సంధ్యారాణి అన్నారు. శనివారం ఆమె క్యాంపు కార్యాలయంలో ₹3,00,503 విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ ముడు చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయనిధి (సిఎంఆర్ఎఫ్) నుండి మంజూరైన చెక్కులను సాలూరు పట్టణానికి చెందిన
ప్రతి పాటి రాజారావు ₹45,751 (సాలూరు)గుళ్లిపల్లి రియానిషి శ్రీనిధి కి ₹1,85,701 (పిట్టాడ ,మెంటాడ) ఎర్ర మురళి కృష్ణ కి ₹85,000 ( పిట్టాడ , మెంటాడ )
మంజూరు చేయబడిందని తెలిపారు మొత్తం ₹3,00,503 విలువైన చెక్కులు లబ్దిదారుల చేతికి అందచేయడం జరిగిందని తెలిపారు..ఈ సందర్భంగా లబ్ధిదారులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు కి మరియు మంత్రి గుమ్మిడీ సంధ్యారాణి కి తమ కృతజ్ఞతలు తెలిపారు. ఆనారోగ్య సమస్యల సమయంలో అందిన ఈ ఆర్థిక సహాయం తమ కుటుంబానికి ఎంతో దోహదపడిందని వారు పేర్కొన్నారు.CMRF ద్వారా ప్రజలకు సకాలంలో ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం అన్నిరకాలుగా కృషి చేస్తుందని మంత్రి గుమ్మిడీ సంధ్యారాణి అన్నారు. సీఎం శ్రీ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రతి వ్యక్తికి మద్దతు అందించేందుకు ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోందని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముఖి సూర్యనారాయణ, పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నిమ్మ తిరుపతిరావు, పాంచాలి సర్పంచ్ గూడెపు యుగంధర్ తదితరులు పాల్గొన్నారు. (Story:పేదలకు అండగా సి ఎం సహాయనిధి)