వినుకొండలో భారీ అగ్నిప్రమాదం
పాత సామాన్లు కొనుగోలు చేసే రెండు గోడౌన్లలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం
కోటి పది లక్షల నష్టం
న్యూస్ తెలుగు / వినుకొండ : స్థానిక మార్కాపురం రోడ్డులో శుక్రవారం తెల్లవారుజామున పి.నెమలయ్య, రంగస్వామి లకు చెందిన పాత సామాన్లు కొనుగోలు చేసే గోడౌన్లలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల భారీగా మంటలు చెలరేగి పాత సామాన్లతో పాటు గోడౌన్ లు కూడా పూర్తిగా దగ్ధమైనట్లు ఫైర్ ఆఫీసర్ నాగేశ్వరావు తెలిపారు. శుక్రవారం తెల్లవారుజామున తమకు సమాచారం అందిన వెంటనే అగ్ని మాపక శకటంతో వెళ్లి మంటలను అదుపు చేస్తూ దర్శి, నరసరావుపేట నుండి కూడా అగ్నిమాపకశకటాలను రప్పించి మంటలను అదుపు చేశామన్నారు. అలాగే అగ్నిప్రమాదం తెలుసుకున్న మున్సిపల్ కమిషనర్ చంద్రబోస్ మున్సిపల్ వాటర్ ట్యాంకర్లు రప్పించి మంటలు విస్తరించకుండా అదుపు చేయడం జరిగింది. గత పదేళ్లుగా ఆ ప్రాంతంలో షెడ్లు ఏర్పాటు చేసుకొని పాత సామాన్లు కొంటూ జీవనం సాగిస్తున్న ఆ రెండు కుటుంబాలు నేడు రెండు గోడౌన్లు అగ్ని కి ఆహుతి కావడంతో బావురుమంటున్నారు. తక్షణం ప్రభుత్వం జోక్యం చేసుకొని తమకు సహాయం అందించాలని పరామర్శకు ఆ ప్రాంతానికి వచ్చిన శాసనసభ్యులు ప్రభుత్వ చీప్ విప్ ఆంజనేయులకు మొరపెట్టుకున్నారు. (Story:వినుకొండలో భారీ అగ్నిప్రమాదం)

