మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షునిగా కొమ్మతోటి
న్యూస్ తెలుగు /వినుకొండ : వినుకొండ పట్టణంలో గంగినేని కళ్యాణ మండపంలో మాల మహానాడు సన్మాన సభ లో రాష్ట్ర అధ్యక్షునిగా కొమ్మతోటి పౌలు ని ఏకగ్రీవంగా ఎన్నుకొని ప్రకటించిన మాల మహానాడు జాతీయ అధ్యక్షులు జి చెన్నయ్య చేతుల మీదుగా ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. అనంతరం ఈ సభలో జాతీయ అధ్యక్షులు జి. చెన్నయ్య మాట్లాడుతూ. ఆంధ్ర రాష్ట్రంలో మాలల అభివృద్ధికి కొమ్ముతోటి పౌలు గత 10 సంవత్సరాల నుండి వివిధ సేవా కార్యక్రమాలు మాల అభివృద్ధికి ఎనలేని కృషి చేయడం జరిగిందని, ఆంధ్ర రాష్ట్ర మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షునిగా నేను ప్రకటించడం జరిగింది. అలాగే రాష్ట్రవ్యాప్తంగా తిరిగి కమిటీలు పూర్తి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ చీఫ్ విప్ మరియు వినుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పాల్గొన్నారు. ఈ సన్మాన సభలో జీవి మాట్లాడుతూ. మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షునిగా కొమ్మ తోటి పౌలు ని ఎన్నుకోవడం వినుకొండ నియోజకవర్గానికి ఎంతో ఆనందదాయకం అని ప్రత్యేకంగా అభినందించి శాలువాతో సత్కరించడం జరిగింది. అలాగే ఈ సభను ఉద్దేశించి మాట్లాడుతూ. వినుకొండ నియోజకవర్గంలోని మాలల అభివృద్ధి సంక్షేమం జీవన అభివృద్ధి కోసం ప్రభుత్వపరంగా తోడ్పాటు అందిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా డి ఎల్ డి ఏ చైర్మన్ లగడపాటి వెంకట్రావు, మాల మహానాడు జాతీయ మహిళా అధ్యక్షురాలు మంచా నాగమల్లేశ్వరి, జి చార్వాక, తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు బూరుగుల వెంకటేశ్వర్లు, ప్రజా పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మువ్వల అన్వేష్, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు డాక్టర్ మల్ల అనిల్ల, కడప జిల్లా మాల మహానాడు అధ్యక్షులు జేష్ఠ ది భాస్కర్, ఈ కార్యక్రమాన్ని పలనాడు జిల్లా కమిటీ వారు మరియు వినుకొండ నియోజకవర్గ కమిటీ వారు పాల్గొన్నారు.(Story:మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షునిగా కొమ్మతోటి)