వినుకొండలో ముమ్మరంగా కాలవల్లో పూడికతీత పనులు
న్యూస్ తెలుగు /వినుకొండ : వినుకొండ మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్ర బోస్ సూచనలతో రాబోయే వర్షాభావ పరిస్థితులను దృష్టి లో ఉంచుకొని పురపాలక సంఘ పరిధిలో ఎటువంటి వరదలు సంభవించకుండా, రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయం కాకుండా నివారించేందుకు, దోమల పెరుగుదలను అరికట్టేందుకు, పట్టణ పరిధిలో ఉన్న అన్ని మేజర్ డ్రైనేజీలు, డీసిల్టేషన్ చేయించవలసిందిగా నిర్ణయించారు. ఇందులో భాగంగా బిపిఎస్ 2019 మరియు ఎల్ఆర్ఎస్ 2020 నియమాలకు లోబడి రాష్ట్ర ప్రభుత్వం పట్టణానికి కేటాయించిన 44.59 లక్షల నిధులతో పలు విడతలుగా కాలువ పూడిక తీసివేత ప్రారంభించారు.. పట్టణంలోని వివిధ వార్డుల నందు అనగా మెయిన్ బజార్, నరసరావుపేట రోడ్, మార్కాపురం రోడ్, ఇసుక వాగు మెయిన్ డ్రైనేజీ మొదలగు ప్రాంతాల్లో డీసిల్టేషన్ పనులు మొదలుపెట్టారు. ఈ పనులను మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ , మున్సిపల్ ఇంజనీర్ ఆదినారాయణ, శానిటరీ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్ తదితరులు పర్యవేక్షిస్తూ పట్టణ ప్రజలు మరియు వ్యాపారస్తులు డీసిల్టేషన్ చేసే సమయంలో డీసిల్టేషన్ సిబ్బందికి సహకరించాలని, ఎటువంటి అడ్డంకులు ఉన్న తొలగించాలని తగు సూచనలు ఇవ్వడం జరిగింది. (Story:వినుకొండలో ముమ్మరంగా కాలవల్లో పూడికతీత పనులు)

