కాంట్రాక్టర్ల అవినీతి పక్కదారి పట్టిన
అభివృద్ధి పనులు
న్యూస్‌తెలుగు/వనపర్తి : సమన్వయం లేని నాయకుల ఇస్టారాజ్యం..కాంట్రాక్టర్ల అవినీతి… అధికారుల లాలూచితో అభివృద్ధి పనులు పక్కదారి పట్టాయని ఐక్యవేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్ అన్నారు. మున్సిపాలిటీ పరిధిలో వేసే 50 కోట్లకు పైగా TUF UDC నిధులతో చేపట్టిన సీసీ రోడ్లలో అవినీతి, అక్రమాలు. పలు సాక్షాదారాలతో అఖిలపక్ష ఐక్యవేదిక నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా ఐక్యవేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్ మాట్లాడుతూ, గత కొద్ది రోజులుగా పట్టణంలో వేస్తున్న సిసి రోడ్లలో నాణ్యత లేదని, అలాగే ఇక్కడ పడితే అక్కడ వేస్తున్నారని, నిబంధనలకు విరుద్ధంగా వారికి కావలసిన చోట వేసుకుంటూ వెళ్తున్నారని, కొన్ని చోట్ల కొందరు చిన్న నాయకులు జేబులు నింపుకొని వేస్తున్నారనేది నిజమని, రోడ్డు అవసరం ఉన్న చోట కాకుండా అవసరం లేని చోట వేస్తున్నారని అధికారుల పర్యవేక్షణ లేదని, మంచి రోడ్లను తీసివేసి మళ్లీ రోడ్డు వేశారని, కోతికి కొబ్బరి చిప్ప ఇచ్చిన చందంగా వీరి వ్యవహారం ఉందని తెలిపారు. ఈ వ్యవహారం అంతా సి డి ఎం ఎ కు, తెలంగాణ సీ.ఎస్ కు, హ్యూమన్ రైట్స్ కు, అవినీతి నిరోధక శాఖకు ఫిర్యాదు చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో సతీష్ యాదవ్, వెంకటేశ్వర్లు, గౌనికాడి యాదయ్య, కొత్తగొల్ల శంకర్, బొడ్డుపల్లి సతీష్, రాజనగరం రామస్వామి, కురుమూర్తి, రాము, శ్రీను, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. (Story:కాంట్రాక్టర్ల అవినీతి పక్కదారి పట్టిన అభివృద్ధి పనులు)

