Homeవార్తలు'కూలీ' తెలుగు రైట్స్ సొంతం చేసుకున్న ఏషియన్ మల్టీప్లెక్సెస్ ప్రైవేట్ లిమిటెడ్

‘కూలీ’ తెలుగు రైట్స్ సొంతం చేసుకున్న ఏషియన్ మల్టీప్లెక్సెస్ ప్రైవేట్ లిమిటెడ్

‘కూలీ’ తెలుగు రైట్స్ సొంతం చేసుకున్న ఏషియన్ మల్టీప్లెక్సెస్ ప్రైవేట్ లిమిటెడ్

న్యూస్‌తెలుగు/ హైద‌రాబాద్ సినిమా :సూపర్ స్టార్ రజనీకాంత్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘కూలీ’కి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (LCU)తో తన విజయాలని కొనసాగిస్తున్నారు. ప్రతిష్టాత్మక సన్ పిక్చర్స్ బ్యానర్ నిర్మించిన కూలీలో రీసెంట్ కుబేర తో బ్లాక్ బస్టర్ అందుకున్న కింగ్ నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్నారు.

తాజాగా డి. సురేష్ బాబు, సునీల్ నారంగ్, దిల్ రాజు యాజమాన్యంలోని ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏషియన్ మల్టీప్లెక్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ కూలీ మూవీ తెలుగు థియేట్రికల్ హక్కులను భారీ ధరకు సొంతం చేసుకుంది. ఇది ప్రాజెక్ట్ చుట్టూ ఉన్న మ్యాసీవ్ హైప్‌ను సూచిస్తోంది.  LCU చిత్రాలన్నీ గతంలో బ్లాక్ బస్టర్ విజయాలు సాధించిన నేపథ్యంలో హక్కుల కోసం గట్టి పోటీ ఏర్పడింది.

రజనీకాంత్, నాగార్జునలతో పాటు సత్యరాజ్, సౌబిన్ షాహిర్, ఉపేంద్ర, శ్రుతీ హాసన్, మహేంద్రన్ వంటి ప్రముఖులు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ గ్రాండ్ గా విడుదల చేయనుంది.

ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్లు, టీజర్లు సినిమాపై భారీ క్రేజ్‌ను నెలకొల్పాయి. తాజాగా విడుదలైన మాస్ సాంగ్ ‘చికిటు’ అదరగొట్టింది. ఆనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించిన ఈ పాటలో ఆయన స్వరాలతో పాటు అరివు కూడా పాటను హై ఎనర్జీగా పాడారు. పాటలో టి. రాజేందర్ సౌండ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. సూపర్‌స్టార్ రజనీకాంత్ డాన్స్‌, విజువల్స్ ఫ్యాన్స్‌కు ఫుల్ ఫీస్ట్‌లా ఉన్నాయి. ఈ పాటకు శ్రీనివాస మౌళి సాహిత్యం అందించారు.

కలానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి టాప్  టెక్నికల్ టీమ్ పని చేస్తోంది. ఆనిరుధ్ సంగీతం, గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ ఫిలోమిన్ రాజ్. ఈ చిత్రం 2025 ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధమవుతోంది.

తెలుగు డిస్ట్రిబ్యూషన్ ఫిక్స్ కావడంతో త్వరలోనే సినిమా ప్రమోషన్స్ దూకుడు పెంచబోతున్నారు.

నటీనటులు: రజనీకాంత్, నాగార్జున, సత్యరాజ్, సౌబిన్ షాహిర్, ఉపేంద్ర, శ్రుతి హాసన్, మహేంద్రన్

సాంకేతిక బృందం:
రచన, దర్శకత్వం: లోకేష్ కనగరాజ్
నిర్మాత: కళానిధి మారన్
బ్యానర్: సన్ పిక్చర్స్
రిలీజ్: ఏషియన్ మల్టీప్లెక్సెస్ ప్రైవేట్ లిమిటెడ్
సంగీతం: అనిరుధ్ రవిచందర్
డిఓపీ: గిరీష్ గంగాధరన్
ఎడిటర్: ఫిలోమిన్ రాజ్
పీఆర్వో: వంశీ-శేఖర్ (Story:’కూలీ’ తెలుగు రైట్స్ సొంతం చేసుకున్న ఏషియన్ మల్టీప్లెక్సెస్ ప్రైవేట్ లిమిటెడ్)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!