Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌డ్రగ్స్ లేని రాష్ట్రం లక్ష్యంలో ఇప్పటికే 99శాతం విజయం

డ్రగ్స్ లేని రాష్ట్రం లక్ష్యంలో ఇప్పటికే 99శాతం విజయం

డ్రగ్స్ లేని రాష్ట్రం లక్ష్యంలో

ఇప్పటికే 99శాతం విజయం

వినుకొండలో డ్రగ్స్ వ్యతిరేక ర్యాలీలో పాల్గొన్న ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ

న్యూస్ తెలుగు / వినుకొండ : కూటమి ప్రభుత్వం వచ్చిన దగర్నుంచి డ్రగ్స్‌ రహిత రాష్ట్రం కోసం తీసుకుంటున్న చర్యల్లో 99 శాతం విజయం సాధించామని ప్రభుత్వ చీఫ్‌విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజ నేయులు ప్రకటించారు. గత వైకాపా ప్రభుత్వం, జగన్ మత్తుపదార్థాలపై వచ్చే కమీషన్ల కోసం కక్కుర్తి పడి యువత భవితను నాశనం చేశారని, ఆ తప్పిదాలన మొత్తం సరిదిద్దుతున్నారని అన్నారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా వినుకొండలో డ్రగ్స్ వ్యతిరేక ర్యాలీని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ప్రారంభించారు. నరసరావుపేట రోడ్డులోని ఐనవోలు పోలీస్ స్టేషన్ వద్ద నుంచి శివయ్య స్తూపం సెంటర్, ఆర్టీసీ బస్టాండ్ నుంచి తిరిగి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం వరకు సాగింది. విద్యార్థులు, యువత ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం జూనియర్ కళాశాల మైదానంలో విద్యార్థులు, యువతతో ఏర్పాటు చేసిన సదస్సులో జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ మాదకద్రవ్యాల్లేని రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లాలనే లక్ష్యంతో రాష్ట్రప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు. గతంలో అన్నపూర్ణగా ఉన్న ఆంధ్రప్రదేశ్ గత అయిదేళ్ల వైకాపా పాలనలో గంజాయి ఆంధ్రప్రదేశ్‌గా మారడం చాలా బాధాకరం. గత పాలకులు ఉన్నప్పుడు 1775మంది యువత నిరాశ, నిస్ఫృహల్లో ఆత్మహత్య చేసుకున్నారు. కారణం గత పాలకులే. వారి అయిదేళ్ల పాలనలో దేశంలో గంజాయి, డ్రగ్స్ ఎక్కడ దొరికినా వాటి మూలాలు ఆంధ్రప్రదేశ్‌లోనే బైట పడేవి. ఏ రైతులు లాభసాటిగా లేరు. రాష్ట్రంలో ప్రతిరైతు నష్టపోయినా గంజాయి పండించిన రైతులు మాత్రం లాభపడ్డారు. గంజాయి రైతుల్ని ప్రోత్సహించిన చరిత్ర జగన్‌ ప్రభుత్వానిది. తెనాలిలో డ్రగ్స్‌కు అలవాటు పడి, ఆ నేరాల్లో ఉన్న వారికి జగన్ మద్దతు ఇచ్చాడు. ఏంటా నీచ సంస్కృతి. రౌడీలు, గంజాయి బ్యాచ్‌లకు జగన్ అండగా నిలిచాడు. ప్రజలు బుద్ధి చెప్పినా వారి తీరు మారలేదు. సిగ్గుపడాలి అలాంటి పనులు చేయడానికి. ఒక మాజీ సీఎం అలా కనీస బాధ్యత లేకుండా వ్యవహరించడం సిగ్గు చేటు. కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర్నుంచి ఈగల్స్ టీమ్ ఏర్పాటు చేసి డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ముందుకు సాగుతున్నాయి. గంజాయి, డ్రగ్స్, గుట్కాల మాట వినిపిస్తే తాట తీస్తున్నారు. 99శాతం ఫలితాలు సాధించారు. మిగిలిన 1శాతం విషయంలో కూడా కఠిన చర్యలు తీసుకున్నారు. ఇదే పని నాడు ఎందుకు చేయలేక పోయారు. ఈమత్తు పదార్థాలపై వచ్చే కమీషన్ల కోసం రాష్ట్ర యువత భవిష్యత్‌ను నాశనం చేశారు. ఈగల్స్ ద్వారా కాలేజీల్లో ఈగల్స్ క్లబ్స్‌ పెట్టి గంజాయిని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. 1972 అనే టోల్‌ఫ్రీ నంబర్ ఇచ్చి ఎక్కడ గంజాయి వాసన కనిపించినా చర్యలు తీసుకునేలా ఏర్పాట్లు చేశారు. ఆ టోల్‌ ఫ్రీ నంబర్‌ను ప్రజలు అందరు ఉపయోగించుకోవాలి. డ్రగ్స్‌ మహమ్మారిని పారదోలాల్సిన బాధ్యత ప్రభుత్వం, అధికారులు, ప్రజలందరిపై ఉంది. ఈగల్స్ క్లబ్ ద్వారా డ్రగ్స్‌ను అరికట్టినందుకు సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు జీవీ ఆంజనేయులు.జనసేన నాయకులు నాగ శ్రీను రాయల్, నాయకులు, మున్సిపల్ కమిషనర్, తాసిల్దార్, సీఐ, ఎస్సైలు, ఎక్సైజ్ అధికారులు, వివిధ శాఖల అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. (Story:డ్రగ్స్ లేని రాష్ట్రం లక్ష్యంలో ఇప్పటికే 99శాతం విజయం)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!