వృద్ధులకు, వికలాంగులకు ఇంటి వద్దకే రేషన్ సరఫరా
న్యూస్ తెలుగు/ చింతూరు : జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వచ్చే జూలై నెల పిడిఎస్ రైస్ ఈ నెల జూన్ 26 నుండి 30 వరకు 65 సంవత్సరాలు వయస్సు పై బడిన వారికి, వికలాంగులుకు ఇంటికే రైస్ డిస్ట్రిబ్యూషన్ చేయటం జరుగుతుంది అని ప్రాజెక్టు అధికారి ఐటిడిఏ అపూర్వ భరత్ పేర్కొన్నారు. దీనికి సంబంధించి ప్రతి ఒక ఎఫ్ పి షాపుకి ఒక సచివాలయం ఉద్యోగిని ఈ బియ్యం పంపిణీ మానిటర్ చేయటానికి నియమించడం జరుగుతుందని ప్రాజెక్టు అధికారి ఐటిడిఏ తెలిపారు. కావున 65 వయస్సు పై బడిన వారు, వికలాంగులు ఎవరు కూడా ఎఫ్బి షాపు వద్ద వెళ్ళవద్దు వారి వద్దకే బియ్యం పంపిణీ చేయటం జరుగుతుందని చెప్పినారు. చింతూరు,వీఆర్పురం, కూనవరం, ఎటపాక మండలాలలో మొత్తం 3694 మంది 65 సంవత్సరాలు పై బడిన వారు, వికలాంగులు ఉన్నారు. అని వీరికి ఈ నెల జూన్ 26 నుండి 30 వరకు రైస్ డిస్ట్రిబ్యూషన్ ప్రణాళిక అనేది సిద్ధం చేయటం జరుగుతుందని ప్రాజెక్టు అధికారి తెలిపారు. (Story:వృద్ధులకు, వికలాంగులకు ఇంటి వద్దకే రేషన్ సరఫరా )

