సిపిఐ ఎమ్మెల్ లిబరేషన్ ఆధ్వర్యంలో మూడవరోజు దీక్ష
న్యూస్ తెలుగు / వినుకొండ : స్థానిక సిపిఐ ఎమ్మెల్ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం తాసిల్దార్ కార్యాలయం వద్ద మూడవరోజు వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎమ్మెల్ లిపరేషన్ రాష్ట్ర కార్యదర్శి పార్టీ బంగారం మాట్లాడుతూ. గత రెండు నెలల నుంచి మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు చట్ట వ్యతిరేకంగా సీలింగ్ ల్యాండ్ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే సంబంధిత అధికారులు అతనిపై సివిల్ అండ్ క్రిమినల్ కేసులు పెట్టలేదని ప్రశ్నించారు. అది సీలింగ్ ల్యాండ్ అయితేనే కదా 2007 సంవత్సరంలో ఒకే సీ పేరు తోటి డీకే నెంబర్ 134 పట్టా ఇచ్చారు కదా అది ఆయన సొంత భూమి అయితే మీరు ఎవరు పట్టా ఇవ్వటానికి అని ప్రశ్నించారు. ఈ నియోజకవర్గంలో భూస్వాములు, పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు ప్రభుత్వ భూములు ఆక్రమిస్తుంటే ప్రభుత్వ అధికారులు గానీ బాధ్యత కలిగిన నియోజకవర్గం ఎమ్మెల్యే ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ఎప్పటికైనా సరే బినామీ పేర్లతో ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసిన భూములు పై ప్రభుత్వం పరిశీలించి వాటిని స్వాధీనం చేసుకోవాలని, లేనిపక్షంలో సిపిఐ ఎంఎల్ పార్టీ పోరాటాలు చేసి పేదలకు పంచుతుందని అన్నారు. ఎమ్మార్వో మాటలతో కాలయాపన చేస్తున్నారు తప్పితే తగిన చర్యలు ఎందుకు తీసుకోలేదని బ్రహ్మనాయుడు కి మీకు ఉన్న ఎలాంటి సంబంధం తొందరలో బట్టబయలు చేస్తామని హెచ్చరించారు. అనంతరం జిల్లా పార్టీ కార్యదర్శి తోట ఆంజనేయులు మాట్లాడుతూ. బ్రహ్మ నాయుడు ఆదివారం ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ. భూమి ఉంటే తీసుకోమని ఓపెన్ గా చెబితే అది ప్రభుత్వం అని డీకే పట్టం మంజూరు చేస్తే ఎమ్మార్వో ఇవాళ ఆ భూమిని స్వాధీనం చేసుకోవడానికి ఎమ్మార్వో ఎందుకడుతున్నాడు అర్థం కావటం లేదని స్థానిక ఎమ్మెల్యే ఈ విషయం పైన మౌన పోరాటం ఎందుకు చేస్తున్నాడు అర్థం కావటం లేదని, ఎప్పటికైనా ఈ సమస్యను పరిష్కారం చేయకపోతే సంబంధిత అధికారులపై కోర్టులో కేసు వేస్తామని హెచ్చరించారు. అనంతరం ఎమ్మెల్ పార్టీ రాష్ట్ర నాయకులు ఎంపీ రాందేవ్ పాల్గొన్నారు. ఈ ధర్నా కార్యక్రమానికి ఎస్కే ఫిరోజ్ అధ్యక్షత వహించగా, సంఘీభావంగా ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు చిన్న మాల మానాడు నాయకులు విజయ్ కుమార్, యువజన నాయకుడు సుబ్బారావు, పిడిఎం రాష్ట్ర నాయకులు వై వెంకటేశ్వరరావు తదితరులు ఈ ధర్నా కార్యక్రమానికి సంఘీభావం తెలిపారు. ధర్నా అనంతరం ఎమ్మార్వో తో చర్చ జరిగింది. ఈ 212 సర్వే నెంబర్లు గల ఈ సీలింగ్ లాంటి భూమిని జులై 30 వ తారీకు లోపు స్వాధీనం చేసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం గణేశుని పాలెం భూ సమస్యను పరిష్కారం చేస్తారని మీరు సహకరించాలని కోరారు. పేదలు ఎవరైనా సరే ఇళ్లస్థలాలకి అర్జీలు పెట్టమని కోరారు. ఈ చర్చల్లో రైతు సంఘం నాయకులు కామా వెంకటేశ్వర్లు, ఓబులాపురం ఆంజనేయులు, మునగపాటి ప్రసాదు, భాస్కర్, యువజన నాయకులు హరికృష్ణ, గణేష్ పాలెం నుండి చెన్న కృష్ణయ్య, వెంకటరత్నం, పార్వతీపురం నుంచి గుంటి నాగేశ్వరావు, పెద్ద వెంకటేశ్వర్లు, సుబ్బారావు, శివయ్య, ఎలమంద వెంకట్రావు మొదలగు వారు పాల్గొన్నారు. జులై 30 తారీఖు లోపు భూములు స్వాధీనం చేసుకోకపోతే పేదలను తీసుకువెళ్లి ఇల్లు ఏపిస్తామని తెలిపారు. అనంతరం ఎస్కే ఫిరోజ్ మాట్లాడుతూ. భూ సమస్యల పరిష్కారం కావాలంటే పోరాటాల ద్వారా మాత్రమే అవుతాయని రుజువైందని గత రెండు రోజుల నుంచి రిలీజ్ సోమవారం వంట వార్పు ధర్నా కార్యక్రమం చేపట్టడం ద్వారా మన కార్యక్రమం విజయవంతంగా ముగిసిందని, దీని ద్వారా మనకు తెలిసిందే ప్రజా ఉద్యమాలు మన సమస్యల పరిష్కారం అనేది ఆచరణలో రుజువైందని, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు వివిధ గ్రామాల నుంచి ప్రజలందరూ వచ్చి దీని జయప్రదం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. (Story:సిపిఐ ఎమ్మెల్ లిబరేషన్ ఆధ్వర్యంలో మూడవరోజు దీక్ష)
