Homeవార్తలు 'పెద్ది' హ్యుజ్ యాక్షన్ నైట్ సీక్వెన్స్ షూటింగ్

 ‘పెద్ది’ హ్యుజ్ యాక్షన్ నైట్ సీక్వెన్స్ షూటింగ్

 ‘పెద్ది’ హ్యుజ్ యాక్షన్ నైట్ సీక్వెన్స్ షూటింగ్

న్యూస్‌తెలుగు/ హైద‌రాబాద్ సినిమా:  గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హైలీ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియా ప్రాజెక్ట్ ‘పెద్ది’. నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిలిం మేకర్ బుచ్చి బాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే సినిమా ఫస్ట్ షాట్ గ్లింప్స్ తో దేశవ్యాప్తంగా హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. పవర్ ఫుల్ కొలాబరేషన్, అద్భుతమైన టీంతో  ‘పెద్ది’ భారతీయ సినిమాలో కొత్త ప్రమాణాలను నెలకొల్పడానికి సిద్ధంగా ఉంది. ప్రముఖ పాన్-ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో విజనరీ వెంకట సతీష్ కిలారు తన ప్రతిష్టాత్మక బ్యానర్ వృద్ధి సినిమాస్ బ్యానర్ పై భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం భారీ యాక్షన్ నైట్ సీక్వెన్స్ షూటింగ్ జరుగుతోంది. స్టార్ డీవోపీ రత్నవేలు ‘పెద్ది’ సెట్స్ నుంచి పవర్ ఫుల్ మోమెంట్‌ను షేర్ చేశారు. గ్లోబల్ స్టార్ తో భారీ నైట్ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నట్లు తెలియజేశారు.

డీవోపీ రత్నవేలు షేర్ చేసిన స్టిల్ లో రామ్ చరణ్ ఇంటెన్స్ అండ్ బీస్ట్ మోడ్ లో కనిపించారు. ప్రస్తుతం ఈ స్టిల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినిమాలో ఈ సీక్వెన్స్ మేజర్ హైలెట్ గా ఉండబోతోంది.

ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేంద్రు శర్మ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

చిత్రానికి స్టార్ డివోపీ ఆర్. రత్నవేలు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు. జాతీయ అవార్డు గెలుచుకున్న నవీన్ నూలి ఎడిటర్. వినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైన్ చేశారు.

ఈ చిత్రం 2026 మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజున ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

తారాగణం: రామ్ చరణ్, జాన్వి కపూర్, శివ రాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: బుచ్చి బాబు సానా
సమర్పణ: మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్
బ్యానర్: వృద్ధి సినిమాస్
నిర్మాత: వెంకట సతీష్ కిలారు
సంగీతం: AR రెహమాన్
DOP: R రత్నవేలు
ప్రొడక్షన్ డిజైన్: అవినాష్ కొల్లా
ఎడిటర్: నవీన్ నూలి
ప్రొడక్షన్ డిజైన్: అవినాష్ కొల్లా
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: V. Y. ప్రవీణ్ కుమార్
మార్కెటింగ్: ఫస్ట్ షో
పీఆర్వో: వంశీ శేఖర్ (Story: ‘పెద్ది’ హ్యుజ్ యాక్షన్ నైట్ సీక్వెన్స్ షూటింగ్)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!