Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ రేణుక హత్య ఉదాంతం పై వివరాలు తెలుసుకున్న ఎమ్మెల్యే

రేణుక హత్య ఉదాంతం పై వివరాలు తెలుసుకున్న ఎమ్మెల్యే

0

రేణుక హత్య ఉదాంతం పై వివరాలు తెలుసుకున్న ఎమ్మెల్యే

న్యూస్ తెలుగు వనపర్తి : పెద్దమందడి మండలం గట్ల ఖానాపురం లో ఇటీవల జరిగిన రేణుక హత్య ఉదాంతానికి సంబంధించిన వివరాలను వనపర్తి శాసనసభ్యులు గౌరవ శ్రీ తూడి మేఘారెడ్డి గారు తెలుసుకున్నారు

ఆదివారం గట్లకానాపురం గ్రామంలోని బాధిత కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించి వారితో మాట్లాడారు

గతంలోనే భర్త చనిపోయిన రేణుక నేడు హత్యకు గురికావడం వారి సంతానం ముగ్గురు ఆడపిల్లలు, ఇద్దరు మగ పిల్లలు మొత్తం ఐదు మంది అనాధలు అయ్యారని వారిని ఆదుకోవాలని గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు

అందుకు సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే వారికి అన్నదండగా ఉంటానని భరోసా కల్పించారు

2. అనంతరం రోడ్డు ప్రమాదానికి గురై చికిత్స పొంది విశ్రాంతి తీసుకుంటున్న వెల్టూరు గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ రామచంద్రయ్య గారి మనవడు ఆంజనేయులు ను ఎమ్మెల్యే పరామర్శించి ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకున్నారు

ఇప్పటికే చికిత్స నిమిత్తం రూ. 2లక్షల 50 వేల విలువగల LOC అందజేశామని ఇకపైన ఏదైనా వైద్య సేవలు అవసరమున్న తన దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు సూచించారు

కార్యక్రమంలో పెద్దమందలు మాజీ జెడ్పిటిసి వెంకటస్వామి, తాజా మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి మాజీ సర్పంచ్ బాలనాగయ్య, మాజీ ఎంపిటిసి దామోదర్, మాజీ సర్పంచ్ వెంకటేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.(Story : రేణుక హత్య ఉదాంతం పై వివరాలు తెలుసుకున్న ఎమ్మెల్యే )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version