Homeవార్తలుతెలంగాణసంఘం బలోపేతానికి రోజుకు 2 గంటలు కేటాయిద్దాం

సంఘం బలోపేతానికి రోజుకు 2 గంటలు కేటాయిద్దాం

సంఘం బలోపేతానికి రోజుకు 2 గంటలు కేటాయిద్దాం

న్యూస్ తెలుగు/వనపర్తి : NSUI విద్యార్థి సంఘం బలోపేతానికి ప్రతి ఒక్కరు రోజుకు 2 గంటలు కేటాయిస్తే 33 జిల్లాలలో వనపర్తి నియోజకవర్గం ముందంజలో నిలుస్తుందని ప్రతి ఒక్కరు సంఘం బలోపేతానికి నిబద్ధతతో పనిచేయాలని వనపర్తి శాసనసభ్యులు గౌరవ శ్రీ తూడి మేఘారెడ్డి గారు పేర్కొన్నారు. ఆదివారం వనపర్తి క్యాంపు కార్యాలయంలో NSUI ఆధ్వర్యంలో నిర్వహించిన హం బదిలేంగే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు వెంకటస్వామి పలువురు రాష్ట్ర నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ NSUI సంగం బలోపేతానికి తాను ఎల్లవేళలా కృషి చేస్తానని, సంఘ నాయకులకు ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా తను అందుబాటులో ఉంటానని ఎమ్మెల్యే పేర్కొన్నారు మత తత్వ పార్టీలు చేసే విష ప్రచారాన్ని విద్యార్థి లోకం తరిమి కొట్టాలని రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో ఒక్కొక్క విద్యార్థి నాయకుడు 100 ఓట్లు వచ్చేలా ప్రయత్నించి పార్టీ బలోపేతానికి సహకరించాలని ఆయన అన్నారు. సంఘం సభ్యత్వ నమోదులో వనపర్తి నియోజకవర్గ ముందు ఉండాలన్నారు. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారి పాలనలో నేడు విద్యా వ్యవస్థ పూర్తిస్థాయిలో పటిష్టమవుతుందన్నారు ఇంటిగ్రేటెడ్ హబ్ నిర్మాణాలు, విద్యార్థులకు 40 శాతం మెస్ చార్జీలు పెంచడం 4th సిటీ ని ఏర్పాటు చేసి యువతకు ఉపాధి కల్పించడం లాంటి అనేక పనులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు మొదటగా ఈ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర నాయకులకు గౌరవంగా స్వాగతం పలికి ర్యాలీగా బయలుదేరి వచ్చిన విద్యార్థులందరికీ ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ వనపర్తి పట్టణ అధ్యక్షులు చీర్ల చందర్,  సంఘం నాయకులు, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వాకిటి ఆదిత్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దలు తదితరులు పాల్గొన్నారు.(Story : సంఘం బలోపేతానికి రోజుకు 2 గంటలు కేటాయిద్దాం )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!