Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ చంద్రబాబు పిలుపునకు ప్రజల స్పందనతోనే గిన్నిస్ రికార్డ్

చంద్రబాబు పిలుపునకు ప్రజల స్పందనతోనే గిన్నిస్ రికార్డ్

0

చంద్రబాబు పిలుపునకు ప్రజల స్పందనతోనే గిన్నిస్ రికార్డ్

యోగాంధ్ర వేడుకలకు భీమిలి నియోజకవర్గ ప్రజల నుంచి విశేష స్పందన

న్యూస్ తెలుగు/వినుకొండ  : అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖ వేదికగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన పిలుపునకు ప్రజల విశేష స్పందన తోనే గిన్నీస్‌రికార్డు సాధ్యమైందని ప్రభుత్వ చీఫ్‌ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. ప్రధానమంత్రి రావడం, ముఖ్యమంత్రి పిలుపునివ్వడం, అందుకు అనుగుణంగా ప్రజా ప్రతిప్రతినిధులు, అధికారుల సమన్వయంతోనే ఊహించిన దానికంటే భారీ స్పందన వచ్చిందన్నారు. విశాఖ తీరంలో 3.01లక్షలమందితో యోగాసనాలకు గిన్నిస్ రికార్డు వచ్చిన సందర్భం గా యోగాంధ్ర కార్యక్రమం భీమిలి నియోజకవర్గం ఇన్‌చార్జ్‌గా ఉన్న ఆయన మీడియాతో మాట్లాడారు. గిన్నిస్ రికార్డు సాధించడం గొప్ప విషయమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు మేరకు మహిళలు, విద్యార్థులు అందరు స్వచ్ఛందంగా వచ్చి పాల్గొని యోగాంధ్రను విజయవంతం చేశారంటూ అందరికీ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ద్వారా యోగా ప్రాధాన్యతపై రాష్ట్రమంతా చైతన్యం వచ్చిందన్న జీవీ ప్రధానమంత్రి మోదీ ఐక్యరాజ్యసమితిలో 11ఏళ్ల క్రితం ప్రపంచయోగా దినోత్సవానికి ఆమోదం తీసుకు రావడం అందుకు అసలైన నాంది అన్నారు. యోగా ద్వారా ఆరోగ్యం, ఆనందం రెండూ సాధించవచ్చని, శరీరం, మనస్సు, ఆత్మకు అనుసంధానానికి అదొక ఉత్తమ మార్గమన్నారు. యోగాను జీవితంలో భాగస్వామ్యం చేసు కుంటే లక్ష్యాలను సాధించడానికి ఏకాగ్రత ఉంటుందని తెలిపారు. పతాంజలి మహర్షి 5వేల సంవత్సరాల క్రితం ఇచ్చిన యోగాను ఎంతోమంది మహానుభావులు ముందుకు తీసుకుని వచ్చారన్న జీవీ చంద్రబాబు కృషితో నేడు ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రతి గ్రామగ్రామాన దీనికి ఆచరణలోకి తీసుకు వచ్చే అవకాశం వచ్చిందన్నారు. మంత్రి లోకేష్‌ చొరవతో ప్రతి స్కూల్‌లో యోగాను ప్రవేశపెట్టడం, ప్రతివారం సాధన చేయించడం చాలా మంచి విషయమని చెప్పారు. దానివల్ల పిల్లలకు ఏకాగ్రత, మానసిక ఆనందం, లక్ష్యాల పట్ల శ్రద్ద పెరుగుతుందన్నారు.(Story : చంద్రబాబు పిలుపునకు ప్రజల స్పందనతోనే గిన్నిస్ రికార్డ్ )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version