Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

న్యూస్ తెలుగు/సాలూరు :  రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ జ్యేయమని ఆంధ్రప్రదేశ్ శ్రీ శిశు సంక్షేమ మరియు గిరిజన శాఖ మాత్యులు గుమ్మడి సంధ్యారాణి అన్నారు. బుధవారం సాలూరు వేణుగోపాలస్వామి ఆలయ ప్రాంగణంలో సాలూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకమండలి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. మొదట ఆమె క్యాంపు కార్యాలయం నుంచి భారీగా జన సందోహంతో ర్యాలీగా వచ్చి, వెంకటేశ్వర డీలక్స్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల లేసి నివాళులర్పించారు. అనంతరం ఏఎంసి అధ్యక్షునిగా ముఖి సూర్యనారాయణ, ఉపాధ్యక్షునిగా మింది సింహాచలం తో పాటు, 17 మంది సభ్యుల ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ రైతులకు ఎటువంటి సమస్య వచ్చినా అందుబాటులో ఉండి వారి సమస్యలు నెరవేరేటట్లు ఏఎంసి పాలకవర్గం కృషి చేయాలని అన్నారు. ఈ కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమ గురించి ఆలోచించి పనిచేస్తుందని అన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే ఆర్ పి బంజ్ దేవ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతులను అన్ని విధాల అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నారని అన్నారు. వ్యవసాయ పరపతి సంఘాలు, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఈ సంఘాలన్నీ రైతులను లాభసాటి చేయడానికి ఉన్నాయని వీటి ద్వారా రైతులు తమ పంటల ఉత్పత్తులను మార్కెట్ కమిటీలకు తీసుకువెళ్లి అమ్ముకున్నట్లయితే గిట్టుబాటు ధర వస్తుందని అన్నారు. ఏఎంసీ చైర్మన్ ముఖి సూర్యనారాయణ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి నేను పార్టీకి చేసిన సేవకు నన్ను గుర్తించి ఈ పదవి ఇచ్చినందుకు మంత్రి సంధ్యారాణికి మాజీ ఎమ్మెల్యే ఆర్పీ బంజ్ దేవ్ కు సాలూరు నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని అన్నారు. రైతులకు అన్నివేళ అందుబాటులో మా పాలకవర్గం ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నిమ్మాది తిరుపతిరావు, మండల అధ్యక్షులు పరమేష్, మక్కువ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుల్ల వేణుగోపాల్ నాయుడు, మెంటాడ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చలుమూరు వెంకటరావు, పాంచాలి సర్పంచ్. గూడెపు యుగంధర్, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రజలు రైతులు పాల్గొన్నారు. (Story:రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!