Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ గిరిజన గ్రామాల్లో సికిల్ సెల్ ఎనిమియాపై అవగాహన

గిరిజన గ్రామాల్లో సికిల్ సెల్ ఎనిమియాపై అవగాహన

0

గిరిజన గ్రామాల్లో సికిల్ సెల్ ఎనిమియాపై అవగాహన

న్యూస్ తెలుగు/సాలూరు : జిల్లాలోని గిరిజన గ్రామాల్లో ప్రజలకు సికిల్ సెల్ ఎనిమియా, నాణ్యమైన వస్తువుల వాడకంపై పార్వతీపురం గిరిజనాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో అవగాహనా కార్యక్రమాన్ని సాలూరు మండలం, ఏనుగుల కొండ వద్ద మంగళవారం రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి నిర్వహించారు.
ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ గిరిజన ప్రజల ఆరోగ్యం కొరకు ప్రభుత్వం పలు పధకాలను ప్రవేశపెట్టిందన్నారు.
జిల్లాలో ప్రస్తుతం సికిల్ సెల్ ఎనిమియా లేదని, దానిపై ప్రజల్లో విస్తృతంగా అవగాహనా కల్పించడం జరుగుతుందని పేర్కొన్నారు. గిరిజనులకు బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలని సూచించారు.
అవగాహన కొరకు వాహనాన్ని సిద్ధం చేశారు. వాహనానికి ఒకవైపు ఎల్ ఈ డి స్క్రీన్స్ తో వీడియో ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. వాహనం చుట్టు విద్యుత్ బల్బులు, పైన మైక్ తో ఆకర్షణియంగా తీర్చిదిద్దారు. ఈ వాహనం ద్వారా సికిల్ సెల్ ఎనిమియా సోకిన వ్యక్తులతో మనం ఎలా మెలగాలి, ఎటువంటి మందులు వాడాలో మైక్ ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించారు.
సికిల్ సెల్ ఎనిమియా ఒక వారసత్వ వ్యాధి. తల్లిదండ్రుల నుండి పిల్లలకు సంక్రమిస్తుందని, పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు.
సికిల్ సెల్ ఎనిమియాకు ప్రస్తుతం పూర్తి స్థాయిలో చికిత్స లేదని కానీ లక్షణాలను తగ్గించడానికి, సమస్యలను నియంత్రించడానికి చికిత్సలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.
ఈ వాహనంలో 180 రకాల బలవర్ధకమైన ఆహార పదార్దాలను విక్రయించడం జరుగుతుందని తెలిపారు.
వాహనం జిల్లాలోని ప్రతీ గిరిజన గ్రామాల్లో పర్యటించడం జరుగుతుందని అన్నారు.
సికిల్ సెల్ ఎనిమియా సోకిన బాధితులకు ప్రభుత్వం తరపున రూ: 10 వేలు ఎలా పొందాల్లో అవగాహన కల్పిస్తారని మంత్రి చెప్పారు.
ఈ వాహనాన్ని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ స్కీం ద్వారా తీసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. గిరిజన ప్రజల ఆరోగ్యం పట్ల కలెక్టర్, ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి ప్రత్యేక శ్రద్ద చూపిస్తున్నారని మంత్రి తెలిపారు..
ఈ సందర్బంగా సికిల్ సెల్ ఎనిమియాపై అవగాహన కొరకు ఏర్పాటు చేసిన గిరి చైతన్య వాహనాన్ని మంత్రి జెండా ఊపి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో పార్వతీపురం గిరిజనాభివృద్ధి సంస్థ అదనపు పధక సంచాలకులు మురళీధర్, సాలూరు ఇంచార్జి తాహసీల్దార్ వి. రంగారావు, సాలూరు మండల అభివృద్ధి అధికారి కె. పార్వతి, సాలూరు మున్సిపల్ కమీషనర్ ఎస్. జయరాం తదితరులు పాల్గొన్నారు. (Story:గిరిజన గ్రామాల్లో సికిల్ సెల్ ఎనిమియాపై అవగాహన)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version