Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత సీట్లను  కేటాయించాలి

ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత సీట్లను  కేటాయించాలి

0

ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత సీట్లను  కేటాయించాలి

జిల్లా కలెక్టర్ డా.బి.ఆర్.అంబేద్కర్

న్యూస్‌తెలుగు/విజయనగరం : ప్రైవేటు పాఠశాలల్లో 1వ తరగతి లో పేదలకు ఉచితంగా కేటాయించవలసిన సీట్ల ను ఆయా యాజమాన్యాలు తక్షణమే కేటాయించాలని జిల్లా కలెక్టర్ డా.బి.ఆర్.అంబేద్కర్ ఆదేశించారు. విద్యా హక్కు చట్టం ననుసరించి ప్రతి ప్రైవేటు పాఠశాల లో 25 శాతం సీట్లను ఉచితంగా పేదలకు కేటాయించవలసి ఉండగా స్థానిక ఫోర్ట్ సిటీ, సన్ స్కూల్, బీసెంట్, చాణిక్య పాఠశాలల్లో ఇంకనూ కేటాయించలేదని, తక్షణమే ఆయా యాజమాన్యాలు కేటాయించాలని, లేని యెడల వారి పై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. సోమవారం వినతులు విభాగం లో తల్లిదండ్రుల నుండి ఫిర్యాదులు అందడం తో కలెక్టర్ పై విధంగా స్పందించారు. ఈ నాలుగు పాఠశాలల ద్వారా 240 సీట్లు కేటాయించవలసి ఉందని, వాటిని వెంటనే కేటాయించమని ఆదేశాలు జారీ చేయాలని డి.ఈ.ఓ మాణిక్యం నాయుడు కు కలెక్టర్ సూచించారు. (sTORY:ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత సీట్లను  కేటాయించాలి)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version