అర్హులైన ప్రతి పేదవాడికిరెండు సెంట్లు ఇంటి స్థలం ఇవ్వాలి
న్యూస్ తెలుగు / వినుకొండ : 17వ వార్డు కొండమెట్ల బజార్లోని అర్హులైన పేదలకు రెండు సెంట్లు ఇంటి స్థలం, ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని ఓబయ్య కాలనీ సచివాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ వినుకొండ పట్టణ సమితి ఆధ్వర్యంలో పేద ప్రజలతో కలిసి నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి చెన్నకేశవులు దేవరాజు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిపిఐ వినుకొండ పట్టణ కార్యదర్శి ఉలవలపూడి రాము పాల్గొన్నారు. ఈ సందర్బంగా రాము మాట్లాడుతూ. గత ప్రభుత్వం మన రాష్ట్రంలో 32 లక్షల ఇళ్ల స్థలాలను పేద ప్రజలకు ఇచ్చామని, ఇంటి నిర్మాణానికి 1,80,000 రుణాన్ని ఇప్పించామని లక్షలాది ఇళ్లను నిర్మించామని చెప్పడం జరిగింది. అయితే అప్పటి ప్రతిపక్ష నాయకులు నారా చంద్రబాబు నాయుడు అనేకసార్లు బహిరంగ సభలో, ఎన్నికల ప్రచారంలో పట్నంలో ఒక సెంటు, రూరల్ లో మూడు సెంట్లు, ఇంటి నిర్మాణానికి 1,80,000 మా పార్టీ అధికారంలోకి వస్తే పట్టణాల్లో రెండు సెంట్లు ఇంటి నిర్మాణానికి నాలుగు లక్షల రూపాయలు ఇస్తామని అనేకసార్లు చెప్పి ప్రతిపక్షం పైన అనేక విమర్శలు చేశారు. ఎన్నికల్లో ప్రజలందరూ కూటమి పార్టీ వైపు మొగ్గుచూపి గతంలో ఎప్పుడు రానంత మెజార్టీతో, ఎప్పుడు రాణాన్ని సీట్లను కూటమి ప్రభుత్వానికి ప్రజలు ఇవ్వడం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం పరిపాలనలోకి వచ్చి ఏడాది ఆయన సందర్భంగా ప్రజలు తమ సొంత ఇంటి కలను నెరవేర్చాలని కూటమి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. పట్నంలో రెండు సెంట్లు ఇంటి స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారని, అర్హులైన వారందరికీ కొత్త రేషన్ కార్డులు, వితంతు వికలాంగుల ఒంటరి మహిళ పెన్షన్లను ఇవ్వాలని గత ప్రభుత్వం ఇచ్చిన ఇంటి స్థలాలు వాగుల్లో స్మశానాల పక్కన ఇచ్చారని వాటిని రద్దుచేసి నివాసయోగ్యమైన ఇంటి స్థలాలను ఇవ్వాలని ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని వెంటనే కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకొని పట్టణాల్లో రెండు సెంట్లు ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని రాము కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం ఓబయ్య కాలనీ సచివాలయం అడ్మిన్ ఏడుకొండలకు ప్రజలు అర్జీలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ 17వ వార్డు శాఖ కార్యదర్శి జె. చెన్నకేశవులు, బి. దేవరాజు, కుమారి మేరి, లక్ష్మి, అరుణ, విజయ రాణి, పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. (Story:అర్హులైన ప్రతి పేదవాడికిరెండు సెంట్లు ఇంటి స్థలం ఇవ్వాలి)

