మనిషికి నిరంతర ఇంధనం ధ్యానమే
న్యూస్ తెలుగు /వినుకొండ : శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో యోగానంద లక్ష్మీనరసింహస్వామి ధ్యాన మందిర పిరమిడ్ మెడిటేషన్ సొసైటీ కార్యక్రమం ఆదివారం నాడు వినుకొండ నియోజకవర్గ మెడిటేషన్ సభ్యులందరూ పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సింగరాయకొండ ధ్యాన మాస్టర్స్ నర్సారెడ్డి మాస్టర్ పాల్గొని దేవస్థానం మరియు విశ్వమాత కోసం రక్షణ ఆశ్రమ నిర్మాణ పనులను పరిశీలించి రాబోవు రోజుల్లో ఈ యొక్క దేవస్థానం క్షేత్రంగా విరాజులుతుందని వారి తెలిపారు. ఇప్పుడు ఉన్నటువంటి స్పీడ్ కాలంలో మనిషికి నిరంతరం ఇంధనం ధ్యానం ధ్యానం ప్రతిరోజు కూడా నిత్యవసరంగా మనిషిని ముందుకు నడిపిస్తుందని వారు అన్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్న ఆలయ కార్యనిర్వాక అన్నదాన ప్రధాన సేవకులు మాల్యాద్రి ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమానికి కానమర్లపూడి పెదకంచెర్ల శానం పూడి మహిళా ధ్యానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జాజుల మాల్యాద్రి, బద్దిక నరసింహారావు, కాకుమాను రామారావు, ఉపేంద్ర, నాగలక్ష్మి, పద్మావతి పాల్గొన్నారు. (Story:మనిషికి నిరంతర ఇంధనం ధ్యానమే)

