Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ పేదలకు అండగా సిఎం సహాయనిధి

పేదలకు అండగా సిఎం సహాయనిధి

0

పేదలకు అండగా సిఎం సహాయనిధి

న్యూస్ తెలుగు /సాలూరు : ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) నుండి మంజూరైన రూ.3,62,917 విలువైన ఆరు చెక్కులను రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యా రాణి ఆదివారం సాలూరులో మంత్రి క్యాంపు కార్యాలయంలో అందజేశారు. ఇందులో భాగంగా మంజూరు అయిన మొత్తల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
సాలూరు పట్టణం 11వ వార్డ్ చిన్నహరిజణపేటకు చెందిన దివాకల తులసికి రూ.49,258,
పాచిపెంట మండలం మోసురుకు చెందిన బొట్టా గౌరీ శంకరరావుకు రూ 30,700 మెంటాడ మండలం బాడెవలసకు చెందిన నీలిరోతూ ప్రశాంత్ కు రూ .85,000మక్కువ మండలం పనసభద్రకు చెందిన కోట శేషగిరిరావుకు రూ.1,00,317 సాలూరు పట్టణం 7వ వార్డ్ గాంధీనగర్ కు చెందిన చింత వాసుదేవారుకు రూ .47,642 సాలూరు పట్టణం 21వ వార్డ్ తెలగవీధికి చెందిన వానపల్లి రమణమ్మకు రూ .50,000
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సిఎం ఆర్ ఎఫ్ ద్వారా ప్రజలకు సకాలంలో ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం అన్నిరకాలుగా కృషి చేస్తుందని అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రతి వ్యక్తికి మద్దతు అందించేందుకు ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోందని మంత్రి పేర్కొన్నారు.ఈ సందర్భంగా లబ్ధిదారులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, మంత్రి గుమ్మిడి సంధ్యారాణికి కృతజ్ఞతలు తెలిపారు. ఆనారోగ్య సమస్యల సమయంలో అందిన ఈ ఆర్థిక సహాయం తమ కుటుంబానికి ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. (Story:పేదలకు అండగా సిఎం సహాయనిధి)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version