Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ ‘జగన్ అంటే నమ్మకం – చంద్రబాబు అంటే మోసం’ అనే పుస్తక ఆవిష్కరణ

‘జగన్ అంటే నమ్మకం – చంద్రబాబు అంటే మోసం’ అనే పుస్తక ఆవిష్కరణ

0

‘జగన్ అంటే నమ్మకం – చంద్రబాబు అంటే మోసం’ అనే పుస్తక ఆవిష్కరణ

 పీడిక రాజన్న దొర

న్యూస్ తెలుగు /సాలూరు : కుటమీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పాలనలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారని ఆంధ్రప్రదేశ్ మాజీ ఉపముఖ్యమంత్రి మాజీ గిరిజన శాఖ మాత్యులు ఆంధ్రప్రదేశ్ వైయస్సార్ పార్టీ పొలిటికల్ అడ్వైజర్ కమిటీ సభ్యులు పీడిక రాజన్న దొర అన్నారు ఆదివారం ఆయన స్వగృహంలో జగన్ అంటే నమ్మకం చంద్రబాబు అంటే మోసం అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుత వైఎస్ఆర్సీపీ జాతీయ అధ్యక్షులు,మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యి సంవత్సరం కాల వ్యవధిలో జరిగిన హత్యలు – అఘాయిత్యాలు – ఆకృత్యాలు -పెరిగిపోయాయని అన్నారు. సూపర్ సిక్స్ అమలు చేయకపోవడం వలన రాష్ట్ర ప్రజలందరినీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోసం చేశారని అన్నారు. అందువలన జగన్ అంటే నమ్మకం – చంద్రబాబు అంటే మోసం అనే పుస్తక ఆవిష్కరణ చేయడం జరిగిందని అన్నారు.ఈ కార్యక్రమంలో సాలూరు పట్టణ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వంగపండు అప్పలనాయుడు , వైసీపీ జిల్లా ప్రచార విభాగ అధ్యక్షులు గిరి రఘు ,జిల్లా వైసిపి ప్రధాన కార్యదర్శి దండి శ్రీనివాసరావు ,సాలూరు మండల వైస్ ఎంపీపీ రెడ్డి సురేష్ , వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అనుబంధ కమిటీ సభ్యులు గొర్లె మాధవరావు కౌన్సిలర్ గొర్లె జగన్ మోహన్ రావు, వైసిపి నాయకులు పువ్వుల శ్రీనివాసరావు, తాడ్డి శంకర్రావు, గిరి చిన్ని, హరి బాలాజీ తదితర నాయకులు పాల్గొన్నారు. (Story:‘జగన్ అంటే నమ్మకం – చంద్రబాబు అంటే మోసం’ అనే పుస్తక ఆవిష్కరణ)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version