తల్లికి వందనం” తల్లిదండ్రులకు భరోసా… పిల్లలకు భద్రత..
న్యూస్ తెలుగు /సాలూరు : ఒకే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికీ తల్లికి వందనం పథకం ఇస్తామని మాట ఇచ్చిన చంద్రబాబు నాయుడు నేడు నెరవేర్చారని ఆంధ్రప్రదేశ్ శ్రీ శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు శనివారం ఆమె క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ
చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పాఠశాలలు తెరిచిన రోజే, పిల్లలకు కొత్త పుస్తకాలు, యూనిఫారం, బెల్ట్, బూట్లు, సాక్సులు పిల్లలకు అందజేశారు. స్కూల్స్ తెరిచిన మొదటి రోజే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పథకంలో నాణ్యమైన కిట్లు ఇచ్చిన విద్యా శాఖా మంత్రి నారా లోకేష్ అని అన్నారు.ఏపీలో ప్రతి పేదింటా పండుగ వాతావరణం నెలకొంది. ఇద్దరు పిల్లలుంటే 26 వేలు, ముగ్గురు ఉంటే 39 వేలు, నలుగురు ఉంటే 52 వేలు, ఒక్కరే ఉంటే 13 వేలు చొప్పున తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం డబ్బులు జమ అయిపోగా… అదే సమయంలో ఒక్కొక్క విద్యార్థికి 2000 చొప్పున పాఠశాలల అభివృద్ధి కోసం కలెక్టర్ల ఖాతాల్లో డబ్బులు జమ అయిపోయాయని తెలిపారు. జగన్ 42 లక్షల మంది విద్యార్థులకు ఇస్తే, కూటమిలో చంద్రబాబు నాయుడు గారు 67 లక్షల మంది విద్యార్థులకు ఇస్తున్నారని అన్నారు.
గత ప్రభుత్వంలో మంత్రులుగా పని చేసిన వారు కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో 82 లక్షల మంది విద్యార్థులు ఉన్నారని అంటున్నారు. అందులో అంగన్వాడీ, LKG, UKG పిల్లలు ఉంటారు. వాళ్ళు ఈ పథకానికి అర్హులు కాదని తెలియదా ? దీనికి సంబంధించి పూర్తి ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. ఇలాంటి దొంగ లెక్కలు చూపించి ఫేక్ ప్రచారం చేస్తున్నారు. అర్హులు ఎంత మంది ఉన్నారో, అంత మందికీ మేము తల్లికి వందనం ఇస్తాం. ఇందులో రెండో ఆలోచనే లేదని అన్నారు.
ఐదేళ్ల పాలనలో ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయని జగన్.. కూటమి ప్రభుత్వం 16 వేలకు పైగా టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తే.. ఆపేందుకు 24 కేసులు తన మనుషులతో దాఖలు చేయించాడు జగన్. నిరుద్యోగులు అంటే ఎందుకు ఇంత కక్ష.అని తెలిపారు.
జగన్.. నీకు నారా లోకేష్ నుంచి మరో సవాల్…
తల్లికి వందనం పధకంలో రూ.2 వేలు లోకేష్ ఎకౌంటులో పడుతున్నాయని ఫేక్ ప్రచారం చేస్తున్నారు. మీకు 24 గంటలు టైం ఇస్తున్నాం… దమ్ముంటే, అది నిరూపించండి. లేదంటే తప్పు అయిపోయిందని ఆ స్టేట్మెంట్ వెనక్కి తీసుకోండి. లేదంటే, మీ పైన చట్ట ప్రకారం చర్యలు ఉంటాయి. మీ ఫేక్ ప్రచారం పై కఠినమైన చర్యలు ఉంటాయి” తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. పిల్లలకు పౌష్టికాహారం అందించే లక్ష్యంతో, “డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం”లో సన్నబియ్యంతో స్కూల్స్ తెరిచిన తొలిరోజే వండి విద్యార్థులకు రుచికరమైన ఆహారాన్ని అందిస్తున్నారని అన్నారు.
ఇది కూటమి ప్రభుత్వం.. ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రభుత్వం.అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆర్ పి బంజ్ దేవ్ పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నిమ్మాది తిరుపతిరావు, ఏఎంసీ చైర్మన్ ముఖి సూర్యనారాయణ, మక్కువ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుల్ల వేణుగోపాల్ నాయుడు, సాలూరు మండల తెలుగుదేశం అధ్యక్షులు ఆముదాల పరమేశు తదితరులు పాల్గొన్నారు. (Story:తల్లికి వందనం” తల్లిదండ్రులకు భరోసా… పిల్లలకు భద్రత..)
