జిల్లా పరిషత్ రంగాపురం హై స్కూల్ ఉపాధ్యాయులకు అభినందనలు
న్యూస్‌తెలుగు/వనపర్తి : పెబ్బేరు మండలంలో ని జిల్లా ఉన్నత పాఠశాల కు సంబంధించిన 25 మంది 10వ తరగతి పాస్ కావడం జరిగింది. పాసైన విద్యార్థులలో 16 మంది విద్యార్థులు, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వివిధ గ్రూపులలో ఎంపీసీ బైపిసి సిఇసి హెచ్ ఇ సి గ్రూపులలో ఆన్లైన్ అడ్మిషన్లు త్వరగా పొందడం జరిగింది, తమ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రంగాపురం పాఠశాల విద్యార్థులు అడ్మిషన్స్ తీసుకోవడానికి ప్రోత్సహించిన ఇంచార్జ్ GHM శ్రీనివాసులు, ఉపాధ్యాయులను. పెబ్బేరు ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, రంగాపురం పాఠశాల ఉపాధ్యాయుల పట్ల కృతజ్ఞత భావంతో మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఉన్నత పాఠశాల ఇంచార్జ్ GHM శ్రీనివాసులు మాట్లాడుతూ మీరు మేము మనమందరం ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నాము తప్పకుండా ప్రభుత్వ సెక్టార్ లో నడిచే విద్య వ్యవస్థలను మనమందరం కలిసి బలోపితం చేద్దాం. మా పాఠశాల విద్యార్థులు తప్పకుండా మీ కళాశాలలో అడ్మిషన్ తీసుకోవడానికి సహకారం ఎల్లప్పుడు ఉంటుందని రంగాపురం పాఠశాల ఉపాధ్యాయులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, కృష్ణయ్య నవీన్ రవీందర్ జ్ఞానేశ్వర్ రెడ్డి జాకీర్ హుస్సేన్ , పాఠశాల ఇంచార్జ్ GHM శ్రీనివాసులు , ఉపాధ్యాయులు పాల్గొన్నారు. (Story:జిల్లా పరిషత్ రంగాపురం హై స్కూల్ ఉపాధ్యాయులకు అభినందనలు)

