Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ వినుకొండ ఆర్టీసీ గ్యారేజీ ఆవరణలో మొక్కలు ప్లాంటేషన్

వినుకొండ ఆర్టీసీ గ్యారేజీ ఆవరణలో మొక్కలు ప్లాంటేషన్

0

వినుకొండ ఆర్టీసీ గ్యారేజీ ఆవరణలో మొక్కలు ప్లాంటేషన్

న్యూస్ తెలుగు /వినుకొండ : ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం లో భాగంగా గురువారం స్థానిక ఆర్టిసి డిపో గ్యారేజ్ ఆవరణలో వివిధ రకాల మొక్కలను నాటారు. డిపో మేనేజర్ జె. నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కార్యాలయ సిబ్బంది గ్యారేజీ, రన్నింగ్ స్టాఫ్, అధికారులు కలిసి మొక్కలు ప్లాంటేషన్ చేయటం జరిగింది. ఈ సందర్భంగా డిఎం నాగేశ్వరరావు మాట్లాడుతూ. మొక్కలు పరిరక్షణ బాధ్యత గ్యారేజ్ సిబ్బంది ఎప్పటికప్పుడు చూస్తూ ఉండాలన్నారు. కాలుష్యం నివారించేందుకు మొక్కలు ఎంతో దోహదబడతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆఫీస్ సూపర్నెంట్ మోహన్ రావు, ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు పి. సాంబశివరావు, ఎన్ఎంయు నాయకులు శివ నాయక్, కార్మిక పరిషత్ నాయకులు పేరయ్య, ఎస్టిఐ లు, గ్యారేజ్ సిబ్బంది పాల్గొన్నారు. (Story:వినుకొండ ఆర్టీసీ గ్యారేజీ ఆవరణలో మొక్కలు ప్లాంటేషన్)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version