Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌14 వ వార్డులో ప‌లు స‌మ‌స్య‌ల‌పై  శాఖ సమావేశం 

14 వ వార్డులో ప‌లు స‌మ‌స్య‌ల‌పై  శాఖ సమావేశం 

14 వ వార్డులో ప‌లు స‌మ‌స్య‌ల‌పై  శాఖ సమావేశం 

న్యూస్ తెలుగు / వినుకొండ : బుధవారం రాత్రి స్థానిక 14వ వార్డులో శాఖ సమావేశం జరిగింది. ఈ సందర్బంగా మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మన్ సండ్రపాటి సైదా, నియోజకవర్గ కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు, పట్టణ కార్యదర్శి ఉలవలపూడి రాము మాట్లాడుతూ. పట్టణంలో రెండు సెంట్లు నివేసిన స్థలం ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు కూటమి ప్రభుత్వం మంజూరు చేయాలని, అదేవిధంగా సూపర్ సిక్స్ పథకాలు తల్లికి వందనం ఉచిత బస్సు రైతులకు పెట్టుబడి సాయం 20,000. వికలాంగులకు వితంతువులకు దివ్యాంగులకు వెంటనే నూతన పెన్షన్లు విడుదల చేయాలని, 14వ వార్డులో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించి నూతనంగా డ్రైవింగ్ లను సిమెంట్ రోడ్లను కరెంటు స్తంభాలను కరెంటు లైన్లను మంచినీటి సౌకర్యం వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. లేనిచో ఆ ప్రాంత ప్రజలతో కలిసి ఉద్యమం చేసి వారి యొక్క మౌలిక వసతులను ఏర్పాటుకు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ వారికి అండగా ఉంటుందని అనేక రాజకీయ అంశాలను వారు ప్రస్తావించారు. అనంతరం నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది. నూతన కమిటీని. సిపిఐ సీనియర్ నాయకులు షేక్ కిషోర్ ప్రవేశ పెట్టగా. ఏకగ్రీవంగా చీరాల అంజయ్య ను కార్యదర్శిగా, సహాయ కార్యదర్శులుగా బాబు, అంజమ్మ ను ముక్కంటి జగదీశ్వరి మిగతా పది మందిని శాఖ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. (Story:14 వ వార్డులో ప‌లు స‌మ‌స్య‌ల‌పై  శాఖ సమావేశం )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!