కోడిపందాలపై పోలీసులు దాడి
3 కత్తులు, మూడు కోడిపుంజులు స్వాధీనం
న్యూస్ తెలుగు/చింతూరు : చింతూరు మండలంలో పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చింతూరు ఎస్ఐ రమేష్ ఆధ్వర్యంలో చిడుమూరు- కుంట గ్రామాల మధ్యలో బుధవారం కోడిపందాలు నిర్వహిస్తుండగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 9 మందిపై కేసు నమోదు చేశారు. మూడు కత్తులు, మూడు కోడిపుంజులను స్వాధీనం చేసుకున్నారు. కోడిపుంజుల పందాలు నిర్వహించడం చట్టరీత్యా నేరమన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. (Story:కోడిపందాలపై పోలీసులు దాడి)

