ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంనకు బెడ్ షీట్లు కవర్లు దిండు కవర్లు పంపిణీ
న్యూస్‌తెలుగు/ చింతూరు : చింతూరు ఆరోగ్య సామాజిక కేంద్రంలో బుధవారం జమాల్ ఖాన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రోగుల బెడ్ లకు 100 బెడ్ షీట్లు కవర్లు100 పిల్లోకవర్లను ట్రస్ట్ చైర్మన్ జమాల్ ఖాన్ ఆసుపత్రి సూపరిండెంట్ కోటిరెడ్డి కి అందజేయడం జరిగింది. రోగులకు బెడ్ షీట్లు పిల్లో కవర్స్ అందుబాటులో సరిపడా లేవని గతంలో జమాల్ ఖాన్ కు కోటిరెడ్డి విన్నవించగా జమాల్ ఖాన్ సానుకూలంగా స్పందించి 100 బెడ్ షీట్ కవర్లు 100 పిల్లో కవర్లు తమ ట్రస్ట్ లోగో తో చేయించి అందజేయడం జరిగింది. గతంలో ఆసుపత్రి ఆవరణలో ట్రస్ట్ ద్వారా లక్షా 50 వేల రూపాయల వ్యయంతో త్రాగునీటి బోరును అడిగిన వెంటనే వేయించడం జరిగింది. అడిగిన వెంటనే స్పందించి ఆసుపత్రికి ఉపయోగపడే వాటిని అందజేయడం పట్ల సూపరిండెంట్ కోటిరెడ్డి ఆసుపత్రి సిబ్బంది జమాల్ ఖాన్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి స్టాప్ నర్స్ జెకె సిటీ ట్రస్ట్ సభ్యులు సమీర్ ఎండి జావేద్, ఎస్ కే రసూల్, మండల నాయకులు ఎండి జహంగీర్, మార్కెట్ కమిటీ సభ్యులు పి సాల్మన్ రాజు, పాల్గొన్నారు.(Story:ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంనకు బెడ్ షీట్లు కవర్లు దిండు కవర్లు పంపిణీ )
