Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌సంవత్సరంలోనే 70 శాతం హామీలు నెరవేర్చిన కూటమి ప్రభుత్వం

సంవత్సరంలోనే 70 శాతం హామీలు నెరవేర్చిన కూటమి ప్రభుత్వం

సంవత్సరంలోనే 70 శాతం హామీలు నెరవేర్చిన కూటమి ప్రభుత్వం

న్యూస్ తెలుగు/ సాలూరు : అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే 70 శాతం హామీలు నెరవేర్చిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని ఆంధ్రప్రదేశ్ శ్రీ శిశు సంక్షేమ మరియు గిరిజన శాఖ మాత్యులు గుమ్మడి సంధ్యారాణి అన్నారు. మంగళవారం ఆమె క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలిచ్చిన తీర్పును వెన్నుపోటు అంటారాప్రజలనే అనమానిస్తారా అని అన్నారు.సైకో జగన్ వైరస్ ను, ఓటు శానిటైజర్ తో ప్రక్షాళన చేసిన రోజు రేపు అని అన్నారు.
సైకో పాలనకు చరమగీతం పాడిన రోజు సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్ మూడు పండుగలు ఒకే సారి వచ్చిన రోజు అని తెలిపారు.వెన్నుపోటు, గొడ్డలివేటు కు పేటెంట్ జగన్ రెడ్డి దే అని అన్నారు.కుంభకోణాల నుండి ప్రజా దృష్టి మళ్లించడానికి ధర్నాల డ్రామా ఆడుతున్న జగన్ ముఠా అని తెలియజేశారు.తొలి ఏడాది 10% హామీలను కూడా అమలు చేయని జగన్ ప్రభుత్వం.అని అన్నారు.ఏ ప్రభుత్వం చేయని విధంగా తొలి ఏడాదిలోనే 70% హామీలు అమలు చేసిన కూటమి ప్రభుత్వం మని చెప్పారు.
ఐదేళ్లలో 85% హామీలను ఎగనామంపెట్టిన జగన్ సర్కార్,బీసీ సామాజిక వర్గానికి చెందిన జింక వెంకట నరసయ్య తన బెరైటీస్ మైన్స్ జగన్ తాత రాజారెడ్డికి కొంత భాగస్వామ్యం కల్పిస్తే కృతజ్ఞత లేకుండా మైన్ ఓనర్ ని హత్య చేసి ఆ మైన్ ను రాజారెడ్డి కబ్జా చేశాడని అన్నారు.. వెన్నుపోటుతో జగన్ కుటుంబం మైన్ యజమాని అయ్యారని.కాంగ్రెస్ ను అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు దోచుకుని అదే పార్టీకి వెన్నుపోటు పొడిచి వైసిపి పార్టీని స్థాపించాడని చెప్పారు.శివకుమార్ స్థాపించిన వైకాపా పార్టీని కబ్జా చేసి అతనికి వెన్నుపోటు పొడిచి,ఎత్తుకొని పెంచిన బాబాయిని గొడ్డలి వేటుతో నరికి చంపిన కిరాతుకుల్ని కాపాడుతూ రక్త సంబంధాన్ని వెన్నుపోటు పొడిచాడని అన్నారు.ఆస్తి కోసం తల్లి, చెల్లిని ఇంటి నుండి గెంటేసి కుటుంబ వ్యవస్థకే వెన్నుపోటు పొడిచాడని తెలిపారు.ఐదేళ్ల పాలనలో 85 శాతం హామీలు ఎగనామం పెట్టి ప్రజలకు వెన్నుపోటు పొడిచాడని అన్నారు మద్యపాన నిషేధంపై మాట తప్పి మడమతప్పి విషపూరిత మద్యం పోసి పేదల ఆరోగ్యానికి వెన్నుపోటు పొడిచాడని అన్నారు. మెగా డీఎస్సీ హామీపై మాట తప్పి యువకులకు వెన్నుపోటు పొడిచాడని అన్నారు.అన్నా క్యాంటీన్లు రద్దుచేసి పేదలను, కార్మికులను వెన్నుపోటు పొడిచాడని,బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సబ్ ప్లాన్ నిధులను లక్షల కోట్లు దారి మళ్లించి సామాజిక న్యాయానికి వెన్నుపోటు పొడిచాడని తెలిపారు.కూటమి పాలనలో తొలి ఏడాదిలోనే 70% హామీలు అమలు చేశామని అన్నారు.గిరిజన సంక్షేమానికి ఈ ఏడాది 1300 కోట్లు కేటాయించామని,మొదటి నెలలోనే 4000 పెన్షన్లు పెంచి అమలు చేశాం. 2720 కోట్లు ఏడాదిలో 34 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. మని అన్నారు.
దీపం-2 కు మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం.. ఇప్పటికీ కోటి సిలిండర్లు ఇచ్చాము ఈ పథకం కోసం ఏడాది 2684 కోట్లు ఖర్చు చేస్తున్నామని.అధికారంలోకి రాగానే రోడ్లపై గుంతలు పూడ్చే కార్యక్రమం చేపట్టామని ,ఇప్పటికీ 1200 కోట్లు ఖర్చు చేసి 20,000 కిలోమీటర్లు రోడ్లు బాగుచేశాంమని తెలిపారు.సంక్షేమం అభివృద్ధి సమపాలనలో చేస్తున్న నాయకుడు నారా చంద్రబాబునాయుడు అని అన్నారు.అసలైన వెన్నుపోటుదారుడు జగన్ రెడ్డి వెన్నుపోటు అంటూ ధర్నాలు చేయడం దొంగే దొంగ అన్నట్టుగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నిమ్మాది తిరుపతిరావు, మండల అధ్యక్షుడు పరమేశు, ఏఎంసి చైర్మన్ ముఖి సూర్యనారాయణ, కౌన్సిలర్ వైకుంఠపు హర్షవర్ధన్, మాజీ అర్బన్ బ్యాంక్ అధ్యక్షులు కూని శెట్టి భీమారావు, మచ్చ శ్యాము తదితరులు పాల్గొన్నారు.(Story : సంవత్సరంలోనే 70 శాతం హామీలు నెరవేర్చిన కూటమి ప్రభుత్వం )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!