Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌మోసం, అవినీతి, వెన్నుపోట్లకు బ్రాండ్‌ అంబాసిడర్ జగన్ రెడ్డి

మోసం, అవినీతి, వెన్నుపోట్లకు బ్రాండ్‌ అంబాసిడర్ జగన్ రెడ్డి

మోసం, అవినీతి, వెన్నుపోట్లకు బ్రాండ్‌ అంబాసిడర్ జగన్ రెడ్డి

85 శాతం హామీలకు ఎగనామం పెట్టిన జగనే అసలైన వెన్నుపోటుదారు

న్యూస్ తెలుగు/వినుకొండ  : రాష్ట్ర రాజకీయాల్లోనే మోసం, అవినీతి, వెన్నుపోట్లకు బ్రాండ్ అంబాసిడర్‌గా నిలిచిన ఘనుడు జగన్ రెడ్డి అని ప్రభుత్వ చీఫ్‌ విప్ , వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ధ్వజమెత్తారు. అలాంటి వ్యక్తి నైజాన్ని గుర్తించి ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు జూన్ 4, 2024 ఎన్నికల ఫలితాల్లో జగన్ దారుణాలకు తగిన గుణపాఠం నేర్పారని, కూటమికి అఖండ మెజారిటీతో ఆశీస్సులు అందించారన్నారు. ఇప్పుడు మద్యం కుంభకోణం బట్టబయలై అరెస్టు భయంతో కొత్త డ్రామాలు మొదలు పెట్టిన అతడు “ఉల్టా చోర్ కొత్వాల్‌కు డాంటే” అన్నట్లు ప్రజలు, కూటమి ప్రభుత్వంపైకే బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాడని మండిపడ్డారు. జూన్‌-4ని వెన్నుపోటు దినంగా నిర్వహించాలని వైకాపా అధ్యక్షుడు జగన్ ఇచ్చిన పిలుపుపై మంగళవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో తీవ్రంగా స్పందించారు. ఒక్కఛాన్స్ అన్న మాటల్ని నమ్మి ప్రజలు అధికారం ఇస్తే 85% హామీలను ఎగనామం పెట్టిన అసలైన వెన్నుపోటుదారు జగన్ అన్నారు. తొలి ఏడాదిలో కనీసం 10% కూడా అమలు చేయలేదని, ఉన్న పథకాలను కూడా రద్దు చేసిన విషయం అప్పు డే మరిచి పోతే ఎలా అని ఎద్దేవా చేశారు. సొంత బాబాయి హత్యలో నిందితులను కాపాడడం, ఆస్తి కోసం తల్లి-చెల్లిని గెంటేయడం, వైఎస్సార్‌సీపీని శివకుమార్ నుంచి లాక్కోవడం, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సబ్‌ప్లాన్ నిధులను లక్షల కోట్లలో కొల్లగొట్టడం ఇవేనా జగన్ అర్హతలని చుర కలు వేశారు. మద్య నిషేధం అమలు గాలికి వదిలి, అన్న క్యాంటీన్లు రద్దు చేసి, మెగా డీఎస్సీ, జాబ్ క్యాలెండర్‌ ఊసు పట్టని జగన్ అసలు ఏ మొహం పెట్టుకుని ఇంకా ప్రజల మధ్యకు వస్తు న్నాడో అర్థం కావడం లేదన్నారు. ఎవరిది మోసం? ఎవరిది సంక్షేమ శకం? అనేది అంచన వేసే మొన్నటి ఎన్నికల్లో ప్రజలు 151 నుంచి 11కు దించి మూల కూర్చోబెట్టినా బుద్ధి మార్చుకోక పోతే ఎలా అని తూర్పారా బట్టారు. సీఎం చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం తొలి ఏడాదిలోనే 70% హామీ లు నెరవేర్చి సంక్షేమ పాలనకు నాంది పలికిందన్నారు చీఫ్‌విప్ జీవీ. నెలకు రూ. 2720 కోట్లు, ఏడాదికి రూ. 34,000 కోట్లతో పింఛన్లు అందిస్తున్నామని, దేశంలోనే ఇదొక చరిత్రగా పేర్కొన్నా రు. దీపం-2 కోసం రూ.2684 కోట్లతో ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఊచితంగా ఇస్తున్నామ ని అన్నారు. రూ.1200 కోట్లతో 20,000 కి.మీ రోడ్ల మరమ్మతులు , చెత్త పన్ను రద్దు చేశామని, రూ.1674 కోట్ల ధాన్యం బకాయిల చెల్లించామన్నారు. ఇచ్చిన మాట ప్రకారం మత్స్యకారులకు రూ. 20,000 చొప్పున భరోసా అందిస్తున్నామని తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేతృత్వంలో 13,000పైగా పంచాయతీల్లో రూ. 4500 కోట్లతో 30,000 పనులు చేపట్టామని గుర్తుంచుకోవాలన్నారు . జగన్ రద్దు చేసిన 94 కేంద్ర పథకాల్లో 73 పునరుద్ధరించామని, బీసీలకు ఇటీవలి బడ్జెట్‌లో రూ. 47,456 కోట్లు కేటాయించామన్న జీవీ వీటిల్లో ఏది వెన్నుపోటు, ఎవరిది మోసమో ప్రజలంతా గమనిస్తున్నారని తెలిపారు.(Story : మోసం, అవినీతి, వెన్నుపోట్లకు బ్రాండ్‌ అంబాసిడర్ జగన్ రెడ్డి )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!