గర్భిణీ మహిళ ఆరోగ్యంగా ఉండాలనేదే ప్రభుత్వ లక్ష్యం
న్యూస్ తెలుగు/సాలూరు : ప్రతి గర్భిణీ మహిళ ఆరోగ్యంగా ఉండాలనేదే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ శ్రీ శిశు సంక్షేమ మరియు గిరిజన శాఖ మాత్యులు శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. సోమవారం వై టి సి కార్యాలయం ఆవరణంలో గర్భిణీలకు సీమంతాలు, పాలపోడి పంపిణీ కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూగిరిజన ప్రాంతాల్లో గర్భిణీలు, బాలింతలు, మరియు 7 నెలల నుండి 3 సంవత్సరాల వయస్సు కలిగిన చిన్నారులకు పాలపోడి పంపిణీ కార్యక్రమం ప్రభుత్వం చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమాన్ని పైలెట్ ప్రాజెక్టుగా సాలూరు, పాచిపెంట, రంపచోడవరం, అనంతగిరి వంటి ఆదివాసీ ప్రాంతాల్లో ప్రారంభించామని తెలిపారు. పోషకాహార లోపం నివారణకు, మాతా శిశు ఆరోగ్య సంరక్షణకు ఈ కార్యక్రమం తోడ్పడుతుందని ఆమె తెలిపారు “ప్రతి గిరిజన తల్లి, ప్రతి చిన్నారి ఆరోగ్యంగా ఉండాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యం. అన్నారు. పాలపోడి వంటి పోషకాహార అంశాల ద్వారా మాతా శిశు మరింత బలపడతారు,” అని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కృష్ణారావు, ఎంపీడీవో పార్వతి,ఐసీడీఎస్ పీ ఒ లక్ష్మి,పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నిమ్మది తిరుపతిరావు, మండల అధ్యక్షులు పరమేసు, మక్కువ మండల అధ్యక్షులు గుల్ల వేణుగోపాల్ నాయుడు, గర్భిణీలు మహిళలు పాల్గొన్నారు. (Story:గర్భిణీ మహిళ ఆరోగ్యంగా ఉండాలనేదే ప్రభుత్వ లక్ష్యం)
