Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌పదవి విరమణ సందర్భంగా ఘన సన్మానం

పదవి విరమణ సందర్భంగా ఘన సన్మానం

పదవి విరమణ సందర్భంగా ఘన సన్మానం

న్యూస్ తెలుగు /వినుకొండ : వినుకొండ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు లో టైపిస్టు గా పని చేస్తున్న ఎం ఏడుకొండలు పదవి విరమణ సందర్భంగా సోమవారం న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో ఘన సన్మానం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా విచ్చేసిన వినుకొండ జూనియర్ సివిల్ జడ్జి ఎం మహతి. న్యాయమూర్తి మాట్లాడుతూ. కొండలు మృదు స్వభావి అని, అందరినీ ఆప్యాయంగా పలకరించే వారని, మంచి క్రమశిక్షణ తో వారి యొక్క పనిని పూర్తి చేస్తారని తెలిపారు. సీనియర్ టైపిస్టుగా వారి సేవలు మర్చిపోలేనివి అని అన్నారు. పలువురు సీనియర్ న్యాయవాదులు మాట్లాడుతూ. పదవి విరమణ పొందిన తర్వాత కుటుంబ సభ్యుల తో సంతోషంగా జీవించాలని కోరారు. కోర్టులో టైపిస్టుగా పనిచేస్తూ న్యాయవాదులతో కొండలు మంచి అనుబంధం కలిగి ఉంటారని తెలిపారు. తన పని తాను చూసుకొని వెళ్లే వారని పలువురు న్యాయవాదులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎం శ్రీనివాసరావు, సెక్రటరీ పి గౌస్ మొహిద్దిన్ ఖాన్, వైస్ ప్రెసిడెంట్ పీ వీ రమణారెడ్డి, ట్రెజరర్ వి శివశంకర్ బాబు, సీనియర్ న్యాయవాదులు
పి జె లూకా, పి సైదారావు, ఎన్ రామ కోటేశ్వరరావు, టి హనుమంతరావు, వై శ్రీనివాసరావు, ఎస్కే సిద్దయ్య, కె చెన్నకేశవరెడ్డి, ఆరే సామ్రాజ్యం, జె తిరుపతిరావు, కే సుందర్ రెడ్డి,టి ఆంజనేయులు బి శ్రీనివాసులు, కే భాను తేజ, జి అనిల్ కుమార్, ఎం ఎలిషా బాబు, వై శ్రీనివాసరావు, ఎం వి అప్పారావు, వి అమర్ బాబు, ఎన్ అశోక్ బాబు, ఎం సీతారామాంజనేయులు, ఎన్ రామాంజనేయులు, శివా నాయక్, కే చెన్నయ్య, బ్రహ్మం, డి నాగరాజు, ఎం చంటి, టి శంకర్రావు, శ్రీనివాసులు, నందీష్, తదితర సీనియర్,జూనియర్ న్యాయవాదులు, న్యాయవాద గుమస్తాలు, కోర్టు సిబ్బంది, ఇతర కోర్టు సిబ్బంది, పోలీసులు పాల్గొన్నారు. సన్మానం అనంతరం అందరికీ ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు. (Story:పదవి విరమణ సందర్భంగా ఘన సన్మానం)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!