Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌మోసపూరిత హామీలతో నే అధికారంలోకి వచ్చారు

మోసపూరిత హామీలతో నే అధికారంలోకి వచ్చారు

మోసపూరిత హామీలతో నే అధికారంలోకి వచ్చారు

న్యూస్ తెలుగు/సాలూరు : కుటమీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకో పోవడంతోనే జూన్ 4వ తేదీ తేదీన వెన్నుపోటు దినంగా ప్రకటించడం జరిగిందని. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ ప్రజలు భారీ ఎత్తున పాల్గొనాలని ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి వైయస్సార్ పార్టీ పొలిటికల్ అడ్వైజర్ కమిటీ సభ్యులు పిడికి రాజన్న దొర అన్నారు. ఆదివారం ఆయన క్యాంపు కార్యాలయంలో వెన్నుపోటు దినం వాల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే దానికి కారణం మోసపూరితమైన హామీలను ఇవ్వడం వలనే అధికారంలోకి వచ్చారని అని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలవడానికి సూపర్ సిక్స్ హామీలను ఇస్తామని చెప్పడంతోనే ప్రజల నమ్మి వీరికి ఓట్లు వేసి గెలిపించడం జరిగిందని అన్నారు. జూన్ 4వ తేదీన కుటమీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని అప్పటినుండి ఇప్పటివరకు ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క వాగ్దానం కూడా అమలు చేయలేదని అన్నారు. అమ్మకు వందనం, అన్నదాత సుఖీభవ, మహిళలకు ఫ్రీ బస్సు, ప్రతి మహిళకి నెలకు 1500,, వాలంటీలను తీసివేయడం, ఎండియు వాహనాలన తొలగించడం, సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేయడం ఇలా ప్రతి హామీ ఇవ్వకుండా ప్రజలను మోసం చేశారు అని అన్నారు . దీని కోసమే ఆంధ్రప్రదేశ్ ప్రజలను నిలువునా మోసం చేసిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన జూన్ 4వ తేదీన వెన్నుపోటు దినంగా ప్రకటించడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చేలా ఈ కార్యక్రమంలో సాలూరు నియోజకవర్గం లో ఉన్న ప్రజలు రైతులు, మహిళలు, విద్యార్థులు, సామాజిక వేత్తలు పెద్ద ఎత్తున ఈ ధర్నాలో పాల్గొని విజయవంతం చేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ వైయస్సార్ పార్టీ అధ్యక్షులు వంగపండు అప్పలనాయుడు, కౌన్సిలర్లు గిరి రఘు, గొర్లె జగన్మోహన్ రావు, మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రెడ్డి పద్మావతి, వైయస్సార్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.(Story : మోసపూరిత హామీలతో నే అధికారంలోకి వచ్చారు  )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!