Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ బిజెపి విభజన రాజకీయాలను తిప్పి కొట్టండి

బిజెపి విభజన రాజకీయాలను తిప్పి కొట్టండి

0

బిజెపి విభజన రాజకీయాలను తిప్పి కొట్టండి

సీపీఐ వందేళ్ళ ఘన చరిత్ర ను ప్రజలకు వివరించండి

సిపిఐ జట్ల శాఖ బహిరంగ సభలో అక్కినేని వనజ

న్యూస్ తెలుగు/ చింతూరు : దేశo లో ప్రస్తుత రాజకీయాలు చాలా క్లిష్టంగా ఉన్నాయని ప్రజల మధ్య ఆర్థిక అసమానతలు తీవ్రంగా పెరుగుతున్నాయని కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రజల మధ్య విభజన రాజకీయాలు పాల్పడుతుందని ఈ దుష్టత వ్యూహలను పార్టీ శ్రేణులు త్రిప్పు కొట్టాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ పిలుపునిచ్చారు. శనివారం సాయంత్రం స్థానిక మున్సిపల్ స్టేడియం వద్ద జట్ల సంఘం శాఖ మహాసభ సంఘము అధ్యక్షులు కుండ్రపు రాంబాబు అధ్యక్షతన జరిగింది . ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బిజెపి వలన దేశ ప్రాదేశిక సమగ్రతకు తీవ్రమైన ముప్పు కలుగుతుందని ప్రజాస్వామ్యం శాంతి సామాజిక న్యాయాన్ని కాపాడుకోవలసిన అవసరం నేటి ప్రజానీకానికి ఉందని ఆమె అన్నారు. సిపిఐ శతవసంతాల కార్యక్రమం దేశవ్యాప్తంగా జరుగుతుందని వందేళ్ళ కమ్యూనిస్టు ఉద్యమంలో ఎర్రజెండా దళిత బడుగు బలహీన మైనార్టీ వర్గాల అభ్యున్నత కోసం రైతులు కార్మిక వర్గాల హక్కుల కోసం నిరంతరం పోరాటాలు చేసిందని ఆమె అన్నారు. సీపీఐ భూస్వామ్య కంబంద హస్తాల్లో చిక్కుకున్న లక్షలాది మంది పేద కుటుంబాలకు విముక్తి కలిగించిందని భూ పోరాటం ద్వారా లక్షలాది ఎకరాలను పంపిణీ చేసిన ఘనత సీపీఐ కు దక్కుతుందని ఆమె అన్నారు.
ఆపరేషన్ కగార్ పేరుతో పోలీసులు దమన కాండ సాగిస్తున్నారని ఆరోపించారు దండకారణ్యం లో ఖరీదు చేస్తున్న సహజ వనరులను అక్రమంగా స్వాధీనం చేసుకుని అక్రమంగా తరలించాడనకి అడ్డుగా ఉన్న ఆదివాసులను మావోయిస్టుల పేరుతో అమానుషంగా కాల్చివేస్తున్నారని ఆరోపించారు. పట్టణాల్లో రెండు 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇంటి స్థలాలు, నిర్మాణానికి 5 లక్షలు సహాయం సూపర్ సిక్స్ పథకాల అమలుకై జూన్ 2న రాష్ట్రవ్యాప్త తహసీల్దార్ కార్యాలయాల వద్ద జరిగే ఆందోళన ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు గత ఎన్నికల ముందు ఇండ్లు నిర్మిస్తాం రేషన్ కార్డుతో పాటు మౌలిక సదుపాయాలైన రోడ్లు, కాలువలు, వీధిలైట్లు, 24 గంటలు త్రాగునీరు అందిస్తామని ఊకదంపుడు ఉపన్యాసాలతో ఓట్లు దండుకొని అధికారంలోకి రాగానే ఎన్నికల వాగ్దానాలకు తిలోదకాలిచ్చి ప్రజలు ప్రజా సమస్యలను పూర్తిగా పక్కకు నెడుతున్నారని వనజ ఆరోపించారు. దశాబ్దాల తరబడి పేదలు సొంత ఇంటి కల నెరవేర్చుకోవడం కోసం అధికారులు అధికార పార్టీ నేతల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్న ఫలితం దక్కడం లేదన్నారు. గత ప్రభుత్వంలో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 32 లక్షల మంది ఇంటి స్థలం పొందినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నప్పటికీ కట్టుకొని వారికి ప్రస్తుత ప్రభుత్వంలో స్థలము నిర్మాణవేయాన్ని పెంచి నిర్మాణ దశలో ఉన్న వారికి అదనపు సహాయాన్ని పెంచి ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. భూమి లేని నిరుపేదలకు రెండు ఎకరాల సాగు భూమి ఇవ్వాలన్నారు. జులై 9న జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఆమె పిలుపునిచ్చారు .ఇంకా ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు బండి వెంకటేశ్వరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు, నగర కార్యదర్శి వి కొండలరావు, సహాయ కార్యదర్శి సప్ప రమణ, జిల్లా కార్యవర్గ సభ్యులు పి లావణ్య, చింతలపూడి సునీల్, పి త్రిమూర్తులు , జట్ల సంఘము అధికారబడి అప్పలనాయుడు, నల్ల రామారావు, వెంకటరావు, తాడితోట కార్యదర్శి వానపల్లి సూర్యనారాయణ, టోన్ కార్యవర్గ సభ్యులు టి నాగేశ్వరరావు, జట్ల సంఘం నాయకులు సత్యనారాయణ గురు తదితరులు పాల్గొన్నారు. (Story:బిజెపి విభజన రాజకీయాలను తిప్పి కొట్టండి)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version