నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే
న్యూస్‌తెలుగు/వనపర్తి : వనపర్తి పట్టడం దాచ లక్ష్మయ్య ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన కేశపోగు సునీత గారి కుమార్తె వివాహానికి వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘా రెడ్డి శనివారం హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం పట్టణ నాయకులు కార్యకర్తలు బంధుమిత్రులతో కలిసి ఆయన ఫోటోలు దిగుతూ సందడి చేశారు. కార్యక్రమంలో వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డ్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, వనపర్తి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చీర్ల చందర్, వనపర్తి యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు వాకిటి ఆదిత్య, పెబ్బేరు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ విజయవర్ధన్ రెడ్డి, వనపర్తి మాజీ ఎంపీపీ శంకర్ నాయక్, మాజీ కౌన్సిలర్ బ్రహ్మం చారి, యాపర్ల రామిరెడ్డి, రంజిత్ కుమార్, బీరం రాజశేఖర్ రెడ్డి వాళ్లే నాయక్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు. (Story:నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే)

