రోడ్ సేఫ్టీపై కడపలో హెచ్ఎంఎస్‌ఐ అవగాహన కార్యక్రమం
న్యూస్‌తెలుగు/కడప: దేశంలో సురక్షితమైన రహదారులు, బాధ్యతాయుతమైన రైడింగ్ ప్రవర్తనను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో, హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్‌ఐ) ఆంధ్రప్రదేశ్‌లోని కడపలో రోడ్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఐటీఐ (కడప, యేర్రగుంట్ల), మైనారిటీల కోసం ఏర్పాటు చేసిన ప్రభుత్వ ఐటీఐ (కడప)ల నుండి 2400 మందికిపైగా విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ క్యాంపెయిన్‌లో భాగంగా పాల్గొనేవారిలో రోడ్ సేఫ్టీ పట్ల ముందు జాగ్రత్తగా వ్యవహరించే దృక్పథాన్ని పెంపొందించేందుకు విద్యా, అనుభవాల ద్వారా అవగాహన కల్పించడం లక్ష్యంగా ఉంది. ప్రవర్తనా మార్పు దిశగా ముందడుగు వేసేలా రూపొందించిన ఈ కార్యక్రమం, రహదారి భద్రతకు సంబంధించిన ప్రాథమిక అంశాలను ఆకర్షణీయంగా, అనుభూతి పరంగా తెలియజేసింది. (Story:రోడ్ సేఫ్టీపై కడపలో హెచ్ఎంఎస్‌ఐ అవగాహన కార్యక్రమం)