Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌హనుమాన్ నగర్ లో ప్రజా సమస్యలు పరిష్కరించాలి రాము డిమాండ్

హనుమాన్ నగర్ లో ప్రజా సమస్యలు పరిష్కరించాలి రాము డిమాండ్

హనుమాన్ నగర్ లో ప్రజా సమస్యలు పరిష్కరించాలి రాము డిమాండ్

న్యూస్ తెలుగు/వినుకొండ  : వినుకొండ పట్టణంలోని 30 వ వార్డు హనుమాన్ నగర్ లో శాఖ సమావేశాన్ని మంగళవారం సాయంత్రం ఎ. పవన్ కుమార్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో సిపిఐ పట్టణ కార్యదర్శి ఉలవలపూడి రాము పాల్గొని మాట్లాడుతూ. జూన్ రెండవ తేదీన వినుకొండ పట్టణంలో తాహసిల్దార్ ఆఫీస్ వద్ద ఇళ్ల స్థలాలు, ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు అర్హులైన వారికి, వృద్ధాప్య వితంతు వికలాంగు పెన్షన్లు ఇవ్వాలని సూపర్ సిక్స్ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా ఉందని, ఈ ధర్నాలో అందరూ పాల్గొనాలని తెలిపారు. సమావేశానికి వచ్చిన సభ్యులు వార్డు సమస్యలపై వివరించడం జరిగింది. హనుమాన్ నగర్ లో, లోవోల్టేజీ సమస్య, త్రీఫేస్ కరెంటు లేకపోవడంతో ఫ్యాన్లు కూడా తిరగటం లేదని ప్రజలు అక్కడ సభ్యులు వివరించడం జరిగింది. 30 ఏళ్ల పైగా హనుమాన్ నగర్ లో ఉంటున్న వారికి స్థలాలకి రిజిస్ట్రేషన్ సౌకర్యం ప్రభుత్వం కల్పించాలని, ప్రభుత్వం హౌసింగ్ లోన్లు శాంక్షన్ చేయాలని, అర్హులైన వారికి పెన్షన్లు ఇవ్వాలని, కొత్త రేషన్ కార్డులు లేని వారికి రేషన్ కార్డులు ఇవ్వాలని అక్కడకు వచ్చిన సభ్యులు వారి సమస్యలను వివరించడం జరిగింది. పై సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సిపిఐ వినుకొండ పట్టణ కార్యదర్శి ఉలవలపూడి రాము ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం నూతన కమిటీ ఎన్నిక నిర్వహించారు. శాఖ కార్యదర్శిగా ఎ. పవన్ కుమార్ , సహాయ కార్యదర్శిగా కొండలు, పదిమంది కమిటీ సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది.(Story : హనుమాన్ నగర్ లో ప్రజా సమస్యలు పరిష్కరించాలి రాము డిమాండ్ )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!