వినుకొండలో ఎన్టీఆర్ 102 వ జయంతి వేడుకలు
న్యూస్ తెలుగు/వినుకొండ : స్థానిక 32 వ వార్డు లో కాలవ కట్ట సెంటర్ లో ఎన్టీఆర్ 102 వ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ పరిటాల విగ్రహాలకు పూల మాల వేసి కేకు కట్ చేసి అల్పాహార పంపిణీ చేయటం జరిగింది. ఈ సందర్బంగా పార్టీ ప్రెసిడెంట్ చిరుమామిళ్ళ కోటేశ్వరావు ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా వార్డు కౌన్సిలర్ వాసిరెడ్డి లింగమూర్తి పాల్గొన్నారు. వార్డు లోని నాయకులు అందరూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. యుగపురుషుడు విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు తెలుగువారి ఆరాధ్య దైవం, తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు, సంక్షేమానికి కొత్త బాట చూపిన సంఘసంస్కర్త అన్న నందమూరి తారక రామారావు అని పలువురు కొనియాడారు.(Story : వినుకొండలో ఎన్టీఆర్ 102 వ జయంతి వేడుకలు )

