శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆవరణలో లక్ష గోవిందా నామార్చన హోమం
న్యూస్ తెలుగు/వినుకొండ : వినుకొండ శ్రీనివాస నగర్ నందు శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆవరణలో ఆదివారం లక్ష గోవిందా నామార్చన హోమం 158 మంది మహిళా భక్తులచే ఆలయ ప్రధాన అర్చక స్వామి ఎస్. శ్రావణ కుమార్ మరియు ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో అత్యంత వైభవపేతంగా కనుల పండగగా ఈ కార్యక్రమానికి భక్తుల పెద్ద ఎత్తున పాల్గొని అత్యంత భక్తి శ్రద్ధలతో వీక్షించారు. అనంతరం ఆలయ అధ్యక్షులు రెడ్డి. బంగారయ్య మాట్లాడుతూ. ఈ ఆలయం లోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారు వినుకొండ నియోజకవర్గం లోనే ఎంతో పేరెన్నిక గన్న స్వామి అని ఆయన ఈ సందర్భంగా కొనియాడారు. ఈ కార్యక్రమంకు కాళ్ళ రామకోటేశ్వరరావు, అచ్యుత సుబ్బారావు, సరే వెంకటసుబ్బయ్య, అన్న వీరబ్రహ్మం, గుడిపాటి కోటేశ్వరరావు, గుడిపాటి బాలసుబ్రమణ్యం, అన్న చిన్న సుబ్బారావు, మోటమర్రి నాగేశ్వరరావు, మరియు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.(Story : శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆవరణలో లక్ష గోవిందా నామార్చన హోమం )

