శాంతి ఆశ్రమ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం
న్యూస్ తెలుగు/వినుకొండ : వినుకొండ శాంతి ఆశ్రమ ట్రస్ట్ సాయి బృందావనం (చిన్న షిరిడి) అఖండ జ్యోతి ప్రదాత నిత్య అన్నదాత పూజ్య శ్రీ హిమాలయ గురుదేవుల జన్మదిన మహోత్సవాన్ని భక్తులు కనుల పండగగా నిర్వహించారు. జన్మదినాన్ని పురస్కరించుకొని శాంతి ఆశ్రమ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో వినుకొండ శివయ్య స్తూపం సెంటర్లో భారీ అన్న సంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ట్రస్ట్ అధ్యక్షులు పెండ్యాల మోహన్ రావు, ట్రెజరర్ కనిగండ్ల రామకోటేశ్వరరావు, వంగపల్లి బ్రహ్మం, పెండ్యాల పుల్లారావు, మహిళా భక్తులు మల్లేశ్వరి, సుధా, మాతాజీ, కోటేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.(Story : శాంతి ఆశ్రమ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం )

