వరి కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలి
న్యూస్ తెలుగు/వనపర్తి : వరి కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ జి. వెంకటేశ్వర్లు ఆదేశించారు.శనివారం పెబ్బర్ మార్కెట్ యార్డు, చెలిమిళ్ళ, వెంకటాపూర్, అయవారిపల్లి వరి కొనుగోలు కంద్రాలను అదనపు కలెక్టర్ సందర్శించారు. వరి కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని, తేమ శాతం సరిగ్గా వచ్చిన వడ్లను తూకం చేసి సిద్ధంగా ఉంచాలన్నారు. లారీలు వచ్చిన వెంటనే ధాన్యాని మిల్లులు, గోదాములకు తరలించాలని నిర్వాహకులను ఆదేశించారు. అకాల వర్షాలు పడుతుండటంతో వడ్లు తడచిపోకుండా టార్ఫాలిన్ కప్పాలని నిర్వాహకులను ఆదేశించారు. ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లు ప్రతి కొనుగోలు కేంద్రానికి లారీలు ప్రతిరోజూ వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిర్వహణ పై నిర్లక్ష్యంగా ఉన్న శ్రీరంగాపూర్ కొనుగోలు కేంద్రం సి.ఇ.ఒ కు, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ కు షోకాజ్ నోటీస్ ఇవ్వాలని ఆదేశించారు.(Story : వరి కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలి )
