ఆకట్టకుంటోన్న ‘కొత్తలవాడి’ మూవీ టీజర్
పుష్ప అరుణ్ కుమార్ నిర్మాతగా రూపొందించిన తొలి చిత్రం ‘కొత్తలవాడి’. టాలెంటెడ్ యాక్టర్ పృథ్వీ అంబార్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమా ప్రామిసింగ్ ఫిల్మ్ మేకర్ సిరాజ్ రచన, దర్శకత్వంలో రూపొందుతోంది. గత నెలలో ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టర్‌కు అద్భుతమైన స్పందన వచ్చి సినిమాపై అంందరిలో ఆసక్తిని రేకెత్తించింది.
కొత్తలవాడి అనేది కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లాలోని గుండ్లుపేట్ తాలూకులో ఉన్న ఒక గ్రామం పేరు,. అందుకనే ఇక్కడ చిత్రం ఎక్కువ భాగాన్ని చిత్రీకరించారు. సినిమా కథకు సంబంధించిన స్థానికత, దాని మూలాలకు నిజమైన రీతిలో ఉండేలా బృందం స్థానిక యాసను కూడా సంభాషణల్లో ఉపయోగించారు.
పృథ్వీ అంబార్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రంలో గోపాల్ దేశ్‌పాండే, రాజేష్ నటరంగ, అవినాష్, కావ్య శైవ, మన్షి సుధీర్, రఘు రమణ కొప్ప, చేతన్ గంధర్వ ఇతర పాత్రల్లో నటించారు.
పా ప్రొడక్షన్స్ నిర్మిస్తోన్న కొత్తలవాడి చిత్రం ద్వారా ఇద్దరు కొత్త సంగీత దర్శకులను మేకర్స్ పరిచయం చేస్తున్నారు. వికాష్ వశిష్ట సినిమాలోని పాటలకు సంగీతాన్ని అందిస్తుంటే, అభినందన్ కశ్యప్ బ్యాగ్రౌండ్ స్కోర్‌ను అందిస్తున్నారు. రఘు నీనందల్లి సినిమాకు మాటలు రాశారు. రామిశెట్టి పవన్ ఎడిటర్‌గా, దినేష్ అశోక్ పోస్టర్ డిజైనర్‌గా వర్క్ చేస్తున్నారు.
రా కంటెంట్‌తో తెరకెక్కుతోన్న ‘కొత్తలవాడి’ చిత్రంలో భావోద్వేగాలు ప్రధానంగా ఉంటాయి. అలాగే ప్రేక్షకులకు కావాల్సిన కమర్షియల్ ఎలిమెంట్స్ సినిమా రూపొందుతోంది. (Story:ఆకట్టకుంటోన్న ‘కొత్తలవాడి’ మూవీ టీజర్)

